Allu Arjun’s AAA cinemas becomes new option for promotional events: అల్లు అర్జున్ AAA సినిమాస్ గత వారం ఆదిపురుష్ ప్రదర్శనతో ప్రారంభమయింది. జూన్ 14న పూజా కార్యక్రమాల అనంతరం ఈ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించారు. ఆ తర్వాత 15న తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అల్లు అర్జున్ స్వయంగా ఈ మాల్, సినిమాస్, అలాగే ఫుడ్‌కోర్ట్‌లను ప్రారంభించారు. ఇక ఈ సినిమా థియేటర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త ప్రచారం మొదలైంది. నిజానికి సినిమా లవర్స్ మాత్రమే కాదు సినిమా పరిశ్రమలోని వ్యక్తులు సైతం ఈ మల్టీప్లెక్స్, దాని ప్రొజెక్షన్ ఆప్షన్స్, సాంకేతిక నైపుణ్యం గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు. దానికి తోడు AAA సినిమాస్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల కోసం లాంజ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ అల్లు అర్జున్అవార్డులు, జ్ఞాపికలను ప్రదర్శనకు కూడా ఉంచారు.
Agent Movie: దేవుడే మమ్మల్నికాపాడాడు.. ఏజెంట్ సినిమాపై ఏషియన్ సునీల్ కామెంట్స్!
ఈ సౌకర్యాలతో పాటు, AAA సినిమాస్ సినీ పరిశ్రమలోని కొన్ని ప్రమోషనల్ ఈవెంట్‌లకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. నిఖిల్ స్పై ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రేపు AAA సినిమాస్ లో జరగనుంది. ఈ అల్లు అర్జున్ AAA సినిమాస్ లో జరగనున్న తొలి సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ఇదే. ఇప్పటి వరకు ప్రమోషనల్ ఈవెంట్‌లు అనగానే ప్రసాద్ ఐమాక్స్, ప్రసాద్ లాబ్స్, కొత్తగా AMB సినిమాస్ ఇవి కాకపోతే ప్రసాద్ లాబ్స్ ఆపోజిట్లో ఉన్న ఆర్కే సినీ ప్లెక్స్ లో జరిపే వారు. ఇక ఇప్పుడు ఈ కొత్త AAA సినిమాస్ అందుబాటులోకి రావడంతో ఇది కొత్త ఆప్షన్ గా మారింది. ఇక AAA సినిమాస్‌లో మొత్తం 5 స్క్రీన్‌లు ఉన్నాయి. స్క్రీన్ 1 67 అడుగుల ఎత్తుతో ATMOS సౌండ్‌తో బార్కో లేజర్ ప్రొజెక్షన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ 2 ATMOS సౌండ్‌తో కూడిన EPIQ లక్సన్ స్క్రీన్ కాగ మిగిలిన మూడు స్క్రీన్‌లు 4K ప్రొజెక్షన్‌ను కలిగి ఉంటాయి. ఇక ఈ స్క్రీన్‌లు అన్ని డాల్బీ 7.1 సౌండ్‌తో ఫిక్స్ చేశారు.