Allu Arjun Supports Janasenani Pawan Kalyan Shares a Post: సరిగ్గా ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కి మద్దతు పెరుగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి జనసేన, తెలుగుదేశం, బిజెపితో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసి బరిలో దిగింది. వైసీపీ ప్రభుత్వాన్ని దించి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రచారం చేస్తూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే మెగా హీరోలు చాలామంది పవన్ కళ్యాణ్ కి మద్దతుగా పిఠాపురం వచ్చి ప్రచారం చేసి వెళ్ళగా బయట నుంచి నాని రాజస్థాన్ సంపూర్ణేష్ బాబుతో పాటు అనేక మంది దర్శకులు ఇతర నటీనటులు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ గా ఎదిగిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కి మద్దతు పలుకుతూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ షేర్ చేశారు.
Ranveer Singh: ఇదేందయ్యా ఈ అరాచకం.. ఆ హీల్స్ ఏంటి?
పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ జర్నీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఎంచుకున్న మార్గం మీద నాకెప్పుడూ గర్వంగానే ఉంటుంది. మీరు మీ జీవితాన్ని సర్వీస్ కి అంకితం చేయాలనుకున్నారు, మీ కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ సపోర్ట్ ఎల్లప్పుడూ మీతోనే ఉంటాయి. మీరు కోరుకుంటున్న విషయాలు జరగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇక ఇప్పటికే మెగా హీరోలు వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళు పిఠాపురం వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. రామ్ చరణ్, చిరంజీవి కూడా వెళతారు అని ప్రచారం జరిగినా వాళ్ళు వెళ్లకపోవడం గమనార్హం. అయితే మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం వెళ్లే అవకాశం ఉంది అనే ప్రచారం ఇప్పటికీ సాగుతోంది. అయితే ఎన్నికల ప్రచార గడువు రేపటి సాయంత్రంతో ముగియనుండగా ఆయన వెళతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.