Ranveer Singh Seen In High Heels Trolls on His Look: బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇటీవల భార్య దీపికా పదుకొనెతో తన పెళ్లి ఫోటోలను తొలగించడం చర్చనీయాంశం అయింది. నిజానికి రణ్‌వీర్ సింగ్- దీపికా పదుకొనె తమ బేబీమూన్ తర్వాత ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. బుధవారం, ముంబైలోని లగ్జరీ జ్యువెలరీ కంపెనీ టిఫనీ & కో యొక్క స్టోర్ ప్రారంభోత్సవానికి రణ్‌వీర్ వింతగా వచ్చాడు. పూర్తిగా తెల్లటి శాటిన్ డ్రెస్ తో పాటు హైహీల్స్ ఉన్న తెల్లటి బూట్లు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రణ్‌వీర్ సింగ్ తన దుస్తులతో పాటు లేతరంగు ఏవియేటర్స్, డైమండ్ నెక్‌పీస్ తో సహా డైమండ్ స్టడ్‌లతో కనిపించాడు. గౌరవ్ గుప్తా రూపొందించిన తెల్లటి శాటిన్ షర్ట్‌ను ప్యాంటు మరియు బెల్ట్‌తో మరియు క్రిస్టియన్ లౌబౌటిన్ చేత తెల్లగా మెరిసే హైహీల్స్ ధరించాడు. 2 కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ కూడా ధరించారు. అయితే అతని డ్రెస్సింగ్ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమ్మాయిలు ధరించే హైహీల్స్ ఈయన ధరించడం? ఏమిటి? అనే చర్చ జరుగుతోంది.
Kannappa : కన్నప్ప పని మొదలుపెట్టిన ప్రభాస్..
కొంతమంది ఈ లుక్ బాగుంది అని అంటుంటే కొంతమంది మాత్రం ఇదేంట్రా ఇలా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి కొంతమంది అయితే ఉర్ఫీ జావేద్ లా ఇదేం పైత్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వివాహమైన ఐదేళ్ల తర్వాత దీపికా, రణ్‌వీర్ సింగ్‌లు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఇక రణవీర్ మంగళవారం నాడు అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీపికా పదుకొనేతో తన వివాహ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి వారి బేబీమూన్‌లో ఉన్నప్పుడు తొలగించాడు. రణవీర్ చేసిన ఈ పని వల్ల రణవీర్ – దీపిక మధ్య సమస్యలు ఉన్నాయని విడిపోయే అవకాశం ఉందని పుకార్లు మొదలయ్యాయి. రణవీర్ ఫోటోలను ఆర్కైవ్ చేశాడా లేదా తన సోషల్ మీడియా ఖాతా నుండి శాశ్వతంగా తొలగించాడా అనేది ఇప్పటికీ తెలియదు. ప్రస్తుతం, రణవీర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన లేడీ లవ్‌తో ఉన్న మరిన్ని చిత్రాలు ఉన్నాయి.