Allu Arjun Returned from Vizag Pushpa 2 Shoot due to Health Issues: ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో సుకుమార్ పుష్ప 2 సినిమాని చాలా జాగ్రత్తగా ఒక శిల్పాన్ని చెక్కినట్టు చెక్కుతున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో మొదలైంది. దీనికి అల్లు అర్జున్ అట్టహాసంగా విశాఖపట్నం చేరుకున్న వెంటనే ఆయన అభిమానులు భారీ ఎత్తున స్వాగతం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. మరో పక్క సుకుమార్ కూడా విశాఖపట్నం చేసుకున్నార. షూటింగ్ కూడా మొదలుపెట్టాలి అనుకుంటున్న సమయంలో అల్లు అర్జున్ అనారోగ్యానికి గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి.
Geetanjali Incident: గీతాంజలిది ఆత్మహత్య కాదు.. వాళ్లు చేసిన హత్యే..!
అసలు వాస్తవానికి ఆయనకి ఏం జరిగిందనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ హుటాహుటిన బయలుదేరి అయిన హైదరాబాద్ చేరుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయం నిజమా? కాదా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పుష్ప 2 సినిమాని ఇండిపెండెన్స్ డే సందర్భంగా జనవరి 15వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తో పాటు సుకుమార్కి చెందిన సొంత నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపడుతోంది. విశాఖపట్నం పోర్టులో కొన్ని సీన్స్ షూట్ చేయాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ అనారోగ్యంతో ఇప్పుడు ఆ ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. అయితే ఇతర యూనిట్ సభ్యులతో షూట్ నిర్వహిస్తారా? లేక అల్లు అర్జున్ కోసం షూట్ వాయిదా వేస్తారా? అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది.