Allu Arjun: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఐకాన్ స్టార్ అంటున్నాం కానీ ఒకప్పుడు బన్నీని స్టైలిష్ స్టార్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు అంటే టక్కున అల్లు అర్జున్ అని చెప్పేస్తారు. అంతలా బన్నీ తన స్టైల్ తో ఫాన్స్ ని ఫిదా చేశాడు. మొదటినుంచి కూడా బన్నీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటూనే ఉన్నాడు. డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ నిత్యం నూతనంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఇకపోతే బన్నీ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ ఇప్పుడు పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకపక్క సినిమాలు చేస్తూనే ఇంకోపక్క యాడ్స్ చేస్తూ బిజీగా మారాడు.
Mahesh Babu: భోళా శంకర్ పై మహేష్ ట్వీట్.. అతనికోసమేనా.. ?
తాజాగా అల్లు అర్జున్ ట్రావెల్ + లీషర్ ఇండియా మ్యాగజైన్ కోసం స్టైలిష్ మోడల్ గా మారిపోయాడు. కర్లీ హెయిర్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. బన్నీ లుక్ అచ్చం పుష్ప 2 లో ఉన్న పుష్ప రాజ్ లానే కనిపిస్తున్నాడు. దీంతో అభిమానులు పుష్పగాడి స్టైల్ అంటార్రా బాబు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే బన్నీ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. పుష్ప 2 తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. ఇది నాలుగో సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి పుష్ప తో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ పుష్ప 2 తో గ్లోబల్ హీరోగా మారతాడా.. ? లేదా ..? అనేది చూడాలి.