అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలు పెట్టి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఆయన జులపాలతో పాటు గడ్డం కూడా పెంచుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర కోసం ఆయన అప్పటి నుంచి అదే జుట్టు అదే గడ్డం మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు పుష్ప 2 సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది కూడా.
Allu Arjun: అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంటే ఐకాన్ స్టార్ అంటున్నాం కానీ ఒకప్పుడు బన్నీని స్టైలిష్ స్టార్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే టాలీవుడ్ లోనే మోస్ట్ స్టైలిష్ హీరో ఎవరు అంటే టక్కున అల్లు అర్జున్ అని చెప్పేస్తారు.