అల్లరి నరేష్ అనగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే హీరో గుర్తొస్తాడు. దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టిన అల్లరి నరేష్, ఒకానొక సమయంలో మొనాటమీలో పడిపోయాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో తనకి కంచుకోటలాంటి కామెడిని వదిలి అల్లరి నరేష్ మొదటిసారి ప్రయోగం చేశాడు. అదే నాంది సినిమా, ఈ నాంది చిత్రమే అల్లరి నరేష్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇక్కడి నుంచి ఆడియన్స్ అల్లరి నరేష్ లోని అల్లరి కాకుండా సీరియస్ హీరోని చూడడం స్టార్ట్ చేశారు. నాంది నుంచి హిట్ ట్రాక్ ఎక్కిన అల్లరి నరేష్, నాంది కాంబినేషన్ నే రిపీట్ చేస్తూ విజయ్ కనకమేడలతో ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నాడు.
షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఉగ్రం’ సినిమాలో పోలిస్ గెటప్ లో అల్లరి నరేష్ మాస్ హీరో అనిపించే రేంజులో ఉన్నాడు. మీసాలు తిప్పి, మాస్ డైలాగులని కూడా చెప్పిన అల్లరి నరేష్, కంప్లీట్ మేకోవర్ లో కొత్తగా కనిపిస్తున్నాడు. మాస్ ఎలిమెంట్స్ కి పూర్తిగా స్కోప్ ఉన్న ఉగ్రం సినిమాతో అల్లరి నరేష్ మరో హిట్ అందుకోవడం గ్యారెంటీ అనే నమ్మకంలో సినీ అభిమానులు ఉన్నారు. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 14న రిలీజ్ కావాల్సిన ఉగ్రం సినిమాని వాయిదా వేస్తూ మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. దాదాపు మూడు వారాలు వెనక్కి వెళ్లిన ఉగ్రం సినిమా మే 5న రిలీజ్ కానుంది. పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి ఉగ్రం సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా అల్లరి నరేష్, విజయ్ కనకమేడల, షైన్ స్క్రీన్ కి హిట్ పక్కా అనే ఫీలింగ్ సినీ అభిమానుల్లో ఉంది.
The fierce cop is striking the Big Screens this summer 💥#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMAY5th ❤️🔥#NareshVijay2@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/GWCiPr9iJw
— Shine Screens (@Shine_Screens) April 3, 2023