బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయి కతియావాడి’ ఈ నెల 25న పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరూ తొలిసారి తెలుగులో నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘గంగూభాయి’ విడుదలైన సరిగ్గా నెల రోజులకు, అంటే మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే… ఇటీవల అజయ్ దేవ్ గన్ ‘గంగూభాయి కతియావాడి’ మూవీ ప్రమోషన్స్ కు తన రోల్స్ రాయిస్ కారులో వచ్చాడు.
Read Also : బీచ్ వేర్ లో హీట్ పెంచేస్తున్న పూజాహెగ్డే
దాదాపు ఏడు కోట్ల ఖరీదైన ఆ కారును చూడగానే అలియాభట్ ‘కలర్ బాగుందం’టూ అభినందించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికీ నెటిజన్స్ తమ బుర్రకు పదను పెట్టారు. ఆ కారును చూడగానే అలియా ‘మైలేజ్ ఎంత వస్తుంద’ని అడిగి ఉంటుందని కొందరంటే, ‘ఇలాంటి కారుని వాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రణబీర్ కపూర్ నుండి తీసుకోవాల’ని అలియా భావించి ఉండొచ్చని ఇంకొందరు ఊహాగానాలు చేశారు. అజయ్ దేవ్ గన్ వాడుతున్న రోల్స్ రాయిస్ మోడల్ కార్ ఇండియాలో ఇంతవరకూ ముఖేశ్ అంబాని, టీ సీరిస్ అధినేత భూషణ్ కుమార్ దగ్గర మాత్రమే ఉందట!