పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ ల ముద్దుల కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆరడుగుల ఎత్తు, మెగా ఫ్యామిలీ గౌరవం, తండ్రి వ్యక్తిత్వం అన్ని పోత పోసినట్లు పెరుగుతున్నాడు అకీరా. తండ్రి దగ్గర లేనప్పటికీ తల్లి రేణు, కొడుకు ఇంట్రెస్ట్ ను తెలుసుకొని అతడికి ఇష్టమైన రంగంలో నడిపించడానికి కృషి చేస్తోంది. ఇక తాజాగా అకీరా తన గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేసిన విషయం విదితమే. అకీరా లో కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయన్న సంగతి చాలా తక్కువమందికి తెలుసు.. ఇటీవల పవన్ లా కర్రసాము నేర్చుకొని అందరికి షాక్ ఇచ్చిన ఈ మెగా వారసుడు తాజాగా సంగీతంలో తన సత్తా చాటాడు. ఇప్పటికే పియానో మీద చిన్న చిన్న ట్యూన్స్ వాయిస్తున్న వీడియోలను రేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న విషయం విదితమే.
ఇక తాజాగా తన గ్రాడ్యుయేషన్ పూర్తైన సందర్భంగా పియానో ద్వారా తన స్నేహితులకు మర్చిపోలేని బహుమతిని ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని దోస్తీ సాంగ్ ను పియానో మీద వాయించి తన స్నేహితులకు అంకితమిచ్చాడు. ఇక పియానో మాస్టర్ లా ఎంతో అద్బుతంగా దోస్తీ సాంగ్ ను వాయించాడు అకీరా.. ఈ అద్భుతం జరిగేటప్పుడు పవన్- రేణు ఇద్దరు పక్కనే ఉండడం విశేషం. కొడుకు ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో పులి కడుపున పులే పుడుతుంది.. అకీరా నిన్ను చూసి మేము గర్వపడుతున్నాము అంటూ పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరవేస్తున్నారు. అంతేకాకుండా పవన్ నటవారసుడిగా నువ్వు త్వరలోనే వెండితెరపైకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు.