నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ‘అఖండ’. బోయపాటి శ్రీను బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకలు వచ్చాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో సినిమా అంటేనే హిట్ అనే నమ్మకాన్ని మరింత పెంచిన ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే విషయం మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ‘అఖండ’ సినిమాలో సీక్వెల్ కి ఉపయోగ పడే ఒక పాయింట్ ని అలానే వదిలేసాము దాన్ని పార్ట్ 2 లో చూపిస్తాము అంటూ బోయపాటి శ్రీను కూడా చెప్పడంతో ‘అఖండ 2’ సినిమా ఉంటుందనే నమ్మకం అందరిలో కలిగింది. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ… బాలయ్య “అఖండ 2 కథ కూడా లాక్ అయ్యింది, షూటింగ్ కి ఎప్పుడు వెళ్లాలి అనే విషయంలోనే క్లారిటీ రావాల్సి ఉంది” అంటూ చెప్పేశాడు.
గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘అఖండ’ సినిమాని స్క్రీనింగ్ చేశారు, ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు బోయపాటి శ్రీను, ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ తో పాటు బాలకృష్ణ కూడా హాజరయ్యాడు. ఈ సమయంలోనే బాలకృష్ణ ‘అఖండ 2’ త్వరలోనే ఉంటుందని ఓపెన్ గా చెప్పేశాడు. బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది, ఆ తర్వాత బాలయ్య ‘NBK 108’ సినిమాలు చేస్తున్నాడు. అనిల్ఈ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాని బాలయ్య కంప్లీట్ చేసే లోపు, బోయపాటి శ్రీను రాం పోతినేనితో చేస్తున్న సినిమాని కంప్లీట్ చేయనున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘అఖండ 2’ సినిమా వచ్చే జనరల్ ఎలక్షన్స్ కన్నా ముందే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ‘అఖండ’ సినిమాని తెలుగుకి మాత్రమే పరిమితం చేసిన మేకర్స్ ‘అఖండ 2’ని పాన్ ఇండియా రేంజులో ప్లాన్ చేయమని నందమూరి అభిమానులు ఆశిస్తున్నారు. మరి బోయపాటి బాలయ్యలు అభిమానుల కోరిక మేరకు ‘అఖండ 2’ సినిమాని పాన్ ఇండియా రేంజులో చేస్తారో లేదో చూడాలి.