Siddharth-Aditi: సినిమా ఇండస్ట్రీ అన్నాకా.. ఎఫైర్స్, రూమర్స్, పెళ్లిళ్లు, విడాకులు, కలిసి ఉండటాలు.. కమిట్మెంట్స్ అన్ని సాధారణమే. అయితే అవన్నీ బయటపడకపోతే.. ఒక్కసారి బయటపడి మీడియా ముందుకు వచ్చాకా లాక్కోలేక పీక్కోలేక తారలు ఇబ్బందిపడుతూ ఉంటారు. ప్రస్తుతం సిద్దార్థ్- అదితి పరిస్థితి అలాగే ఉంది. ప్రస్తుతం ఈ జంటను అభిమానులు నరేష్ – పవిత్ర జంటతో పోలుస్తున్నారు. అయితే ఏజ్ విషయంలో కాదులేండి.. వారు ప్రవర్తిస్తున్న తీరు ఎవరికి అంతుపట్టడంలేదు అని చెప్పాలి. పవిత్ర నరేష్ గురించి మాట్లాడుకొంటే.. సమ్మోహనం సినిమా సమయంలో మొదలైన వీరి ప్రేమాయణం మొన్నీమధ్య జరిగిన పెళ్లివరకు వచ్చి ఆగింది. అసలు ఈ జంట గురించి రూమర్స్ వచ్చాయే కానీ ప్రూప్స్ లేవు కదా అనుకుంటున్నా సమయంలో నరేష్ మూడో భార్య రమ్య వలన పవిత్రా నరేష్ ఒక హోటల్ లో అడ్డంగా దొరికిపోయారు. దీంతో వారు మీడియా ముందు బయటపడ్డారు. మొదట స్నేహితులన్నారు.. ఆ తరువాత ప్రేమికులన్నారు.. ఇప్పుడు పవిత్ర బంధం మాది అంటున్నారు. ప్రేమకు వయస్సు లేదు అని చెప్పుకొచ్చారు. సరే అయితే ఆ ప్రేమను అందరికి చూపించాల్సిన అవసరం ఏముంది. రమ్యకు విడాకులు ఇచ్చి పవిత్రను నాలుగో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటే.. రమ్య మాత్రం నా బిడ్డకు తండ్రి కావాల్సిందే అని మంకు పట్టు పట్టుకు కూర్చోవడంతో నరేష్ ప్రస్తుతం లాక్కోలేక పీక్కోలేక ఉన్నాడు.
Oscar 2023: ఈసారి ఆస్కార్ పట్టేసిన విజేతలు వీరే
ఇక సిద్దార్థ్- అదితి విషయానికొస్తే.. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.. విడాకులు కూడా అయ్యాయి. నరేష్- పవిత్ర లానే.. ఈ జంట కూడా మాకెందుకు భయం అన్నట్లు.. ఒకే ఇంట్లో ఉంటున్నారు.. బయటికి ఒకటిగానే వెళ్తున్నారు.. పార్టీలు, ఫంక్షన్స్ అంటూ కలిసే తిరుగుతున్నారు. అయితే మరీ మీ మధ్య ఏముంది అంటే మాత్రం మాది పవిత్ర బంధం అన్నట్లు చెప్పుకొస్తున్నారు. కానీ, పెళ్లి గురించి మాత్రం గుట్టు బయట పెట్టడం లేదు. మరీ వీరిని ఏమనుకోవాలి అనేది అభిమానులకు అంతుపట్టని ప్రశ్న. ఇటీవల అదితి ఒక ఇంటర్వ్యూలో తమ రిలేషన్ గురించి చెప్పమంటే.. కయ్యమని లేచింది. సినిమా ప్రమోషన్స్ కు వచ్చినప్పుడు అందుకు సంబంధించిన ప్రశ్నలే అడగాలని పర్సనల్ ప్రశ్నలు వేయొద్దని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తమది ఒక పవిత్ర బంధం అనే టైప్ లో చెప్పుకొచ్చింది. దీంతో అమ్మడిపై విమర్శలు గుప్పుమంటున్నాయి. అవును అవును.. మీరే చెప్పాలి పవిత్ర బంధాలు గురించి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం అదితి.. సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న హీరామండీ సిరీస్ లో నటిస్తోంది. మరి ఈ సిరీస్ తో అమ్మడు ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.