స్పెషల్ సాంగ్స్ లో యాక్ట్ చేయమని ఆఫర్ చేస్తే ఆమడ దూరం పరిగెత్తే వాళ్లు స్టార్ హీరోయిన్లు. అది వన్స్ అపాన్ ఎ టైమ్ మాట. కానీ జిల్ జిల్ జిగేల్ రాజా అంటూ పూజా హెగ్డే, ఊ అంటావా మామా ఊహూ అంటావా మామ అని సమంత ఆ బారియర్స్‌కు చెక్ పెట్టేశారు. చెప్పాలంటే ఈ పాటలతో విపరీతమైన క్రేజ్ వచ్చింది బ్యూటీలకు. కెరీర్ కూడా ఊపందుకుంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రేంజ్‌కు వెళ్లారీద్దరు. ఇక పుష్ప 2లో కూడా ఆడిపాడింది శ్రీలీల. కిస్సిక్ సాంగ్‌తో బాలీవుడ్ చూపు తనవైపు తిప్పుకునేలా చేసింది. ఇప్పుడు బీటౌన్ లో కార్తీక్ ఆర్యన్ తో జోడీ కట్టే ఛాన్స్ కొల్లగొట్టింది. అలాగే తెలుగులో రెండు స్పెషల్ సాంగ్స్ చేసిన పూజా హెగ్డే తమిళంలో తొలిసారిగా కూలీలో ఆడిపాడనుంది.
పూజా, సమంత, శ్రీలీల బాటలోనే నడుస్తోంది అందాల బ్యూటీ కేతిక శర్మ. ఇప్పటి వరకు గ్లామర్ తో కట్టిపడేసిన ఈ సోయగం ఫస్ట్ టైం తన అందచందాలతో కుర్రకారు మతిపొగొట్టేయబోతుంది. నితిన్- శ్రీలీల జంటగా నటిస్తోన్న రాబిన్ హుడ్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. బ్రో తర్వాత తెలుగులో కనిపించకుండా పోయిన అమ్మడు ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ తో తళుక్కున మెరిసింది. అదిదా సర్ప్రైజ్ అనే ఐటం సాంగ్ చేస్తోంది. కాసేపటి క్రితం ప్రోమో రిలీజ్ చేసారు మేకర్స్. ప్రజెంట్ తమిళంలో ఓ సినిమా బాలీవుడ్ లో ఓ సినిమా చేసున్న కేతిక అదిదా సర్ప్రైజ్ సాంగ్ తిరిగి బాలీవుడ్, టాలీవుడ్ లో సర్పైజ్ కెరీర్ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ.