Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా అభిమానులతో పంచుకుంది. “నేను రెండు రోజుల క్రితం గుండెపోటుకి గురయ్యాను. వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు. అలాగే గుండె లోపల స్టెంట్ అమర్చారు. నాకు వైద్యం అందించిన కార్డియాలజిస్ట్ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వెల్లడించారు. ఈ ప్రమాదం నుండి నన్ను బయటపడేలా చేసిన చాలామందికి కృతజ్ఞతలు చెప్పాలి. ఇక ఈ పోస్ట్ ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే.. నేను బాగానే ఉన్నాను అన్న గుడ్ న్యూస్ ను నా అభిమానులతో అనుచరులతో పంచుకోవాలనుకున్నాను. అందుకే ఈ విషయం మీకు చెప్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.
Laya: పవన్ భోజనం చేయమన్నా చేయలేదు.. రావడమే గొప్ప అంటూ
ఒక్కసారిగా తమ అభిమాన నటికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్నీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. వెంటనే ఆమె ఎలా ఉందో అని ఆందోళన చెందుతున్నారు. అయితే రెండు రోజులు అవుతున్నా ఈ విషయం బయటికి తెలియకుండా ఎలా ఉంది అంటూ బాలీవుడ్ మీడియాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగానే ఉండడంతో వారు కొద్దిగా ఊపిరి పీల్చుకొని.. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.