టాలీవుడ్ అందాల హీరోయిన్ శ్రీయా శరన్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో శ్రీయ నటించి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ గా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి విభిన్నమైన పాత్రలలో నటిస్తున్న ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియా లో మాత్రం ఇంకా సెగలు రేపుతూనే ఉంది. ఒక బిడ్డకు తల్లి అయినా కూడా శ్రీయాలో ఇసుమంతైనా అందం తగ్గలేదనే చెప్పాలి. ఇక భర్త ఆండ్రీతో కలిసి శ్రీయ చేసే రచ్చ మాములుగా ఉండదు. వెకేషన్స్ లో భర్తతో ఎంజాయ్ చేస్తూ ముద్దుల్లో మునిగి తెలుతూ కనిపిస్తూ ఉంటుంది.
ఇక తాజాగా భర్త,స్నేహితులతో గోవా టూర్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తాజాగా మరోసారి ముద్దులాటలో మునిగి తేలింది. స్విమ్మింగ్ పూల్ లో జలకటాల తరువాత తడి బట్టలతోనే భర్త అధరాలను గాఢంగా చుంబిస్తూ ఫోటోలకు పోజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ పెడుతున్నారు. శ్రీవారితో సరసాలు బావున్నాయి.. కానీ, మరి ఇంతలా రెచ్చిపోవాలా అని కొందరు.. సోషల్ మీడియాలో ఎందుకు సెగలు రేపుతున్నారు అంటూ కామెంట్స్ పెడుతూన్నారు.
A post shared by Андрей Кощеев (@andreikoscheev)