Samyukta Menon: సినిమా.. ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎప్పుడు స్టార్లు అవుతారో.. ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఎప్పటి నుంచో ఒకటే మాట వినిపిస్తూ ఉంటుంది. గోల్డెన్ లెగ్.. ఐరన్ లెగ్. ఒక హీరోయిన్ మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటే గోల్డెన్ లెగ్ అని మొదలు పెడతారు.. ఇక అడుగుపెట్టిన ప్రతి సినిమా హిట్ అయితే.. బ్రహ్మాజీ చెప్పినట్టు ప్లాటినమ్ లెగ్ అంటారేమో. ప్రస్తుతం సంయుక్త మీనన్ ను అదే పేరుతో పిలుస్తున్నారు టాలీవుడ్ జనాలు. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగుతెరకు ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి సంయుక్త మీనన్. మొదటి సినిమానే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించి మంచి గుర్తింపునే అందుకుంది. ఇక అదే జోష్ లో బింబిసారలో మెరిసింది. అది హిట్ కొట్టేసింది. చిన్న పాత్రే అయినా కూడా అమ్మడికి బాగానే మార్కులు పడ్డాయి. ఇక ఆ తరువాత వెంకీ అట్లూరి కంట్లో పడింది. సార్ సినిమాలో ధనుష్ తో నటించే ఛాన్స్ పట్టేసింది. మాస్టారు.. మాస్టారు అంటూ కుర్రకారు గుండెలను మొత్తం లాగేసింది. వరుస హిట్లు.. అమ్మడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఖచ్చితంగా హిట్ అని నమ్మకం వచ్చేసింది.
Samantha: కొన్ని గుర్తులు చెరిపినా చెరగవు బంగారు.. ఆ టాటూ కూడా
ఇక ఇప్పుడు విరూపాక్ష. తేజ్ ప్రమాదం ముందు నుంచి కూడా కొద్దిగా విజయాలు లేక ఇబ్బంది పడుతూనే వస్తున్నాడు. ఇక రెండేళ్ల తరువాత ఈ సినిమాతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా హిట్ అందుకుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ప్లాటినమ్ లెగ్ గా మారిపోయింది. నక్క కాదు దానికి మించి తొక్కి ఉంటుంది అందుకే ఇక అంతకు ముందు సినిమాలా కన్నా ఇందులో కొద్దిగా ట్యాలెంట్ కూడా చూపించిందని టాక్. దీంతో ఏమండీ అందానికి, నటనకు ఫిదా అయిపోతున్నారు అభిమానులు. ఇలాగే గోల్డెన్ లెగ్ అనిపించుకున్న హీరోయిన్ల లిస్ట్ తీస్తే శ్రీలీల, కృతి శెట్టి అని చెప్పుకోవచ్చు. కృతికి వరుస అవకాశాలు, స్టార్లతో వచ్చాయి కానీ, విజయాలు మాత్రం దక్కలేదు. ఇక శ్రీలీల రేసు గుర్రంలా వరుసగా స్టార్ల సినిమాల్లో నటిస్తోంది. వై ఎన్ని హిట్ అందుకుంటాయో తెలియదు. మరి ఈ ముద్దుగుమ్మ కూడా ఇకనుంచి ఆచితూచి అడుగులు వేస్తే కొన్నేళ్లు ఆ ప్లాటినమ్ లెగ్ అని పేరు ఉంటుంది. లేకపోతే కొందరు సీనియర్ హీరోయిన్స్ లా ఐరన్ లెగ్ అనిపించుకోవాల్సిందే.