2016లో నాని నటించిన ‘జెంటిల్ మాన్’ సినిమా ఏ టైంలో రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి తెలుగు సినీ అభిమానులకి హీరోయిన్ నివేత థామస్ క్రష్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోస్ పక్కన నటించినా కూడా గ్లామర్ హద్దులు దాటకుండా కెరీర్ బిల్డ్ చేసుకుంది నివేత. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే నివేత గత కొంతకాలంగా చాలా చూసీగా సెలక్టివ్ సినిమాలని మాత్రమే చేస్తోంది. దీంతో నివేత తెరపై కనిపించడం తగ్గిపోయింది, ఇతర భాషల్లో కూడా నివేత నటించిన సినిమాలు పెద్దగా రిలీజ్ కాకపోవడంతో, ఈ మలయాళ బ్యూటీ కావాలనే సినిమాలని తగ్గించేసిందేమో అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. గ్లామర్ షోకి హద్దులు ఉండడమే నివేత థామస్ కెరీర్ గ్రాఫ్ తగ్గడానికి కారణం అనే వాళ్లు కూడా ఉన్నారు.
Read Also: RRR: కీరవాణికి మరో అవార్డ్… ఎక్కడా తగ్గట్లేదు, ఆస్కార్ తెచ్చెయ్ మావా బ్రో…
సినిమాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల విషయంలో కూడా నివేత థామస్ అంతే జాగ్రత్తగా ఉంటుంది. స్కిన్ షో చేసే ఫోటోలని అస్సలు పోస్ట్ చెయ్యదు నివేత థామస్, దాదాపు ట్రెడిషనల్ లేదా ట్రెండీ అవుట్ ఫిట్స్ లోనే అందంగా కనిపించడం నివేత థామస్ సొంతం. సారీలో మరీ అందంగా కనిపించే నివేత థామస్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో కొత్త ఫోటోలని డంప్ చేసింది. నివేత థామస్ వయొలెట్ కలర్ సారీలో ఉన్న ఫోటోస్ ని చూస్తే యూత్ ఎవరైనా సరే ‘ఇదిగో మా హార్ట్ తీసుకో’ అని ఇచ్చేస్తారు అంత బ్యూటిఫుల్ గా ఉంది నివేత. ఈమెని అందరూ క్యూట్ గానే చూడడానికి ఇష్టపడతారు కాబట్టి అట్లీస్ట్ ఆ ఇమేజ్ నుంచి అయినా నివేత థామస్ కాస్త దూరం వస్తే కెరీర్ లో మళ్లీ గ్రోత్ కనిపించే ఛాన్స్ ఉంది.
Iniya Pongal nalvaazhthukkal
Sankranti scenes 😊🪁🌱 pic.twitter.com/OYgdy5xQel— Nivetha Thomas (@i_nivethathomas) January 15, 2023