ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియాకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అయినా ఆస్కార్ అవార్డ్ తెస్తుంది అనే నమ్మకాన్ని రోజు రోజుకి నిజం చేస్తున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి. రీసెంట్ గా నాటు నాటు సాంగ్ కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్నాడు కీరవాణి. ఈ ఘనత సాధించిన మొదటి ఏషియన్ ఫిల్మ్ గా ఆర్ ఆర్ ఆర్ కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేరుతోంది. సంగీతానికి సరిహద్దులు లేవు అని నిరూపిస్తూ కీరవాణి, ఆర్ ఆర్ ఆర్ సినిమాని సముద్రాలు దాటి కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాడు. గోల్డెన్ గ్లోబ్ సొంతం చేసుకున్న ఆనందంలో ఉండగానే లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ లో బెస్ట్ ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరిలో కీరవాణి అవార్డుని గెలుచుకున్నాడు.
కీరవాణి అవార్డు గెలుచుకున్నట్లు తెలియజేస్తూ ఆర్ ఆర్ ఆర్ అఫీషియల్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా మ్యూజిక్ కేటగిరిలో అయినా ఆస్కార్ తెస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో మరింత ఎక్కువ అయ్యింది. హాలివుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి లాస్ ఏంజిల్స్ ఫైల్ క్రిటిక్స్ వరకూ పోటీ చేసిన ప్రతి చోటా అవార్డుని గెలుచుకున్న కీరవాణి, ఆస్కార్ ని కూడా ఇండియాకి తెచ్చేస్తే అంతకన్నా గొప్ప విషయం మరొకటి లేదు. ఏ కేటగిరిలో ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఆస్కార్ గెలిచినా, ఇండియన్ సినిమా హాలీవుడ్ లో జెండా ఎగరేసినట్లే అవుతుంది. మరి మార్చ్ 12న… “నాట్ సల్సా, నాట్ ఫ్లేమికో మై బ్రదర్… డు యు నో నాటు…” అని ప్రతి ప్రపంచం మొత్తం మన పాటకి జై కొడుతుందేమో చూడాలి.
Congratulations to our Music Director @MMKeeravaani on winning the Award for BEST MUSIC/SCORE for #RRRMovie at @LAFilmCritics !! 🎼 🎶 🔥 🌊 pic.twitter.com/mcylG0GdBM
— RRR Movie (@RRRMovie) January 15, 2023