Kollywood: తమిళ చిత్రసీమలో తీవ్ర విషాదం: మనోబాల కన్నుమూత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manobala: ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు మనోబాల (69) బుధవారం చెన్నైలోని హాస్పిటల్ లో అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన కాలేయ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. 1953 డిసెంబర్ 8న జన్మించిన మనోబాల డబ్భైవ దశకంలో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. కమల్ హాసన్ సిఫార్స్ తో 1979లో ‘పుదియ వార్పుగల్’ చిత్రానికి మనోబాల అసిస్టెంట్ డైరెక్టర్ గా భారతీరాజా వద్ద వర్క్ చేశారు. స్వతహా రచయిత కూడా అయిన మనోబాల తొలి చిత్రంలోనే చిన్న పాత్రను పోషించారు. ఆ తర్వాత దర్శకత్వ శాఖలో కొనసాగుతూనే నటుడిగా భిన్నమైన పాత్రలు చేస్తూ వెళ్ళారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా ఆయన తనదైన బాణీని పలికించి, తమిళ ప్రేక్షకుల హృదయసీమలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1982లో ‘అగయ గంగై’ సినిమాతో మనోబాల దర్శకుడిగా మారారు. అక్కడ నుండి దాదాపు పాతిక పైగా చిత్రాలను రూపొందించారు. ఆయన తమిళంలో తెరకెక్కించిన ఓ సినిమానే దాసరి నారాయణరావు తెలుగులో ‘నా మొగుడు నాకే సొంతం’గా రీమేక్ చేశారు. ఈ సినిమా హిందీ, కన్నడ రీమేక్స్ కు మనోబాలే దర్శకత్వం వహించారు. అలానే మూడు సినిమాలను నిర్మించారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో 450 సినిమాలలో నటించారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ మనోబాల నటించారు. ఆయన హఠాన్మరణంతో తమిళ చిత్రసీమలోని ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలుపుతున్నారు.
Also Read
- Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
- Manchu Manoj: మనోజ్‌కు డైరెక్టర్ గోపీచంద్ మాలినేని బర్త్ డే విషెస్.. బాలయ్య సినిమాలో మంచు మనోజ్ కీ రోల్!
- Mamitha Baiju: చేస్తే అలాంటి సినిమాలే చేయాలి..మమితా బైజు ఎమోషనల్ కామెంట్స్!
- Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
-
Google Search Big Update: గూగుల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ చేంజ్.. కొత్త ఏఐ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
-
Gulab Lassi Recipe: హీట్‌కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
Anil Ravipudi: ‘పెద్ది’ ట్రైలర్ పై..అనిల్ రావిపూడి భారీ ప్రశంసలు!
ట్రెండింగ్
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?