Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
80వ దశకంలో సౌత్ ఇండియా సిల్వర్ స్క్రీన్‌ను ఏలిన స్టార్ సిస్టర్స్ అంబిక, రాధల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఒకప్పుడు కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన ఈ అక్కాచెల్లెళ్ల వ్యవహారం ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ కు చేరడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. రూ.46 కోట్ల భారీ మోసం వ్యవహారంలో తన సొంత అక్క, ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంబికతో పాటు సొంత తమ్ముడు మల్లికార్జున్ కుంజన్ నాయర్‌పై రాధ తాజాగా చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సంచలన ఫిర్యాదు చేశారు. ఈ భారీ మోసం వెనుక తన తోబుట్టువులు వేసిన పక్కా స్కెచ్‌ను రాధ పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు. వ్యాపార లావాదేవీల అవసరాల నిమిత్తం తాను గతంలో కొన్ని ఖాళీ చెక్కులపై సంతకాలు చేసి ఉంచానని రాధ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, 2025లో తన వ్యాపార సంస్థ పేరు మారడంతో, బ్యాంకు నుంచి కొత్త చెక్ బుక్ తీసుకున్నానని, నాటి నుంచి పాత చెక్ బుక్ వాడకాన్ని పూర్తిగా నిలిపివేశానని ఆమె స్పష్టం చేశారు. కచ్చితంగా ఈ విషయం తెలిసిన అక్క అంబిక, తమ్ముడు మల్లికార్జున్ ఇద్దరూ కుమ్మక్కై తనకే తెలియకుండా ఆ పాత చెక్ బుక్ లోని 5 చెక్కులను దొంగిలించారని ఆమె ఆరోపించారు.
దొంగిలించిన ఆ ఖాళీ చెక్కులను సోదరుడు మల్లికార్జున్ స్వయంగా నింపాడని, ఏకంగా రూ.46 కోట్ల భారీ మొత్తాన్ని అక్క అంబిక పేరు మీద రాసి బ్యాంకులో డ్రా చేయడానికి సమర్పించారని రాధ వెల్లడించారు. అయితే, ఈ నెల 17న బ్యాంకు అధికారుల నుంచి రాధకు ఊహించని కాల్ రావడంతో అసలు బండారం బయటపడింది. తాను వాడకం ఆపేసిన పాత చెక్కులు అంబిక పేరుతో బ్యాంకుకు డిపాజిట్ కు వచ్చినట్లు తెలిసి తాను షాక్‌కు గురైనట్లు రాధ తెలిపారు. తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండా దొంగిలించిన చెక్కులను అక్రమంగా వాడారని ఆమె ఫిర్యాదులో మండిపడ్డారు. నమ్మిన సొంత అక్క, తోడబుట్టిన తమ్ముడే తనను ఇంతటి భారీ ఆర్థిక మోసానికి గురిచేయాలని చూడటంతో రాధ తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. వారితో ఇక తెగతెంపులు చేసుకుని నేరుగా చెన్నై పోలీసులను ఆశ్రయించారు. రాధ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. డబ్బు కోసం కన్న పేగు బంధాలు కూడా ఎలా దారితప్పుతాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమంటూ సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కోట్లాది రూపాయల కోసం అంబిక, రాధల మధ్య రేగిన ఈ వివాదం, పోలీస్ విచారణలో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read
- The Paradise Censor Cuts: నాని 'ది ప్యారడైజ్' పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
- Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
- Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు... ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!