Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oscars 2027: ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే సాధారణంగా ఒక దేశం నుంచి అధికారికంగా ఒక్క సినిమానే ఎంపికవుతుందని మనకు తెలుసు. అయితే 2027 ఆస్కార్ రేసులో భారత్ విషయంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా మారింది. ఇప్పటికే మరాఠీ సినిమా ‘గోంధళ్’ను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఎంపిక చేయగా, నాగాలాండ్‌కు చెందిన ‘అంగ్’ కూడా మరో మార్గంలో ఆస్కార్ రేసులోకి వచ్చింది. ఒకటి భారత్ అధికారిక ఎంట్రీగా, మరొకటి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు ద్వారా అర్హత సాధించడం విశేషం.
నిజానికి భారతదేశం తరఫున ఒకే ఒక్క సినిమా అధికారికంగా ఆస్కార్‌కు ఎంపికవుతుంది. ఆ హోదాను మరాఠీ చిత్రం ‘గోంధళ్’ (Gondhal) దక్కించుకుంది. అయితే నాగాలాండ్ విప్లవాత్మక నేపథ్యం ఉన్న ‘అంగ్’ (Angh) సినిమా కొత్త అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నేరుగా ఆస్కార్ బరిలోకి దిగే అరుదైన అవకాశం దక్కించుకుంది. కాబట్టి టెక్నికల్ గా చూస్తే, ఈ రెండు సినిమాలు వేర్వేరు మార్గాల ద్వారా 2027లో జరగబోయే 99వ ఆస్కార్ అవార్డుల రేసులో నిలిచి ప్రపంచ వేదికపై భారత్ సత్తాను చాటుతున్నాయి.
Also Read
- Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
- Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
- Devi Sri Prasad: డీఎస్పీ మాస్ విధ్వంసం.. 100 మంది కళాకారులతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్!
- Tamannaah: ఆ యాక్టర్ కామెంట్స్‌పై ఏడాది తర్వాత స్పందించిన తమన్నా..
మొదటగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కమిటీ దేశవ్యాప్తంగా వచ్చిన 33 సినిమాలను పరిశీలించి, సంతోష్ దావఖర్ దర్శకత్వం వహించిన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ ‘గోంధళ్’ సినిమాను ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీకి భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో నూతన వధూవరుల జీవితాల బాగు కోసం రాత్రంతా నిర్వహించే ‘గోంధళ్’ అనే జానపద దైవిక పూజ జరుగుతుండగా, తెరవెనుక ఒక ప్రమాదకరమైన ప్రేమ, మోసం, మరియు హత్యల కుట్ర చుట్టూ సాగే అద్భుతమైన కథాంశంతో ఇది రూపొందింది. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఈ ఆస్కార్ ఎంపికతో ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ పెరిగింది.
మరోవైపు తేజా రియో దర్శకత్వం వహించిన నాగా కల్చరల్ పీరియడ్ డ్రామా ‘అంగ్’ థియేట్రికల్ రిలీజ్ కాలేదనే సాంకేతిక కారణాల వల్ల ఇండియన్ జ్యూరీ రేసులో ‘గోంధళ్’ కంటే వెనుకబడింది. అయితే టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ఈ మూవీ అత్యున్నత ‘ప్లాట్‌ఫామ్ ప్రైజ్’ గెలుచుకుంది. ఆస్కార్ అకాడమీ సరికొత్త నిబంధనల ప్రకారం, కొన్ని ఎంపిక చేసిన అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో ప్రధాన అవార్డు గెలిచిన సినిమాలు తమ దేశ అధికారిక ఎంట్రీతో సంబంధం లేకుండా నేరుగా ఆస్కార్ రేసులోకి అర్హత సాధించవచ్చు. ఆ విధంగా ‘అంగ్’ కూడా స్వతంత్రంగా ఆస్కార్ బరిలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.
అంటే ‘గోంధళ్’, ‘అంగ్’ రెండూ ఒకే విధంగా ఆస్కార్‌కు వెళ్లడం లేదు. ‘గోంధళ్’ భారత్ అధికారిక ఎంట్రీగా నిలిచింది. ‘అంగ్’ మాత్రం టొరంటోలో సాధించిన ప్లాట్‌ఫామ్ ప్రైజ్ ఆధారంగా అకాడమీ కొత్త రూల్స్ ద్వారా రేసులోకి నేరుగా వచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆస్కార్ రేసులో అర్హత సాధించడం అంటే నామినేషన్ ఖరారైందని కాదు. ‘గోంధళ్’, ‘అంగ్’ రెండూ ఇప్పుడు ఆస్కార్ పరిశీలనలోకి వెళ్లే అర్హతను పొందాయి. ఆ తర్వాత అకాడమీ ప్రక్రియలో షార్ట్‌లిస్ట్, నామినేషన్లు వంటి తదుపరి దశలు ఉంటాయి. మరి వీటన్నిటినీ దాటుకుని 2027 ఆస్కార్ వేడుకల్లో భారతీయ సినిమాలు సత్తా చాటితే మాత్రం ఇండియన్ సినీ ఇండస్ట్రీకి అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు.
- Tags
- cinema
- Oscars 2027
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!