Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) సినిమా గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో కొంత గందరగోళం నెలకొంది. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మేకర్స్ మరోసారి రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తూ, సినిమా ప్రమోషన్స్‌ను కూడా వేగం పెంచుతూ ఫస్ట్ సింగిల్ పై ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుండి మొదటి సింగిల్ ‘నారాయణమ్మ’ సాంగ్ రేపే (2026 సెప్టెంబర్ 22న) విడుదల కాబోతోంది. ఇవాళే హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ అదిరిపోయే అప్డేట్ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్స్ తర్వాత వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ ఫస్ట్ సింగిల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ క్రేజీ సాంగ్‌కు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందించారు. రేపు రాబోతున్న ‘నారాయణమ్మ’ సాంగ్ ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ అని, ఇది థియేటర్లలో వింటేజ్ వెంకటేష్ మార్క్ స్టెప్పులతో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయమని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం థమన్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ ట్యూన్స్‌తో గట్టి ప్లాన్ వేశారని, ఈ ఒక్క పాటతోనే సినిమా హైప్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడబోతోందంటూ వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ, ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికే.. అంటే గాంధీ జయంతి కానుకగా 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ నాగవంశీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో దసరా సీజన్లో వెంకటేష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమైంది. మరి రేపు విడుదల కానున్న ‘నారాయణమ్మ’ మాస్ పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read
- Tags
- Aadarsha Kutumbam
- cinema
తాజావార్తలు
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
-
Airtel Postpaid Plans Price Hike: Airtel కస్టమర్లకు షాక్.. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ధరలు భారీగా పెంపు
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!