Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- ప్రపంచానికి ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి
- అందరినీ వేడుకుంటున్నానన్న షేక్ మహమ్మద్ బిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా శాంతి కరవైంది. ఎక్కడ చూసినా యుద్ధం మాటే వినిపిస్తోంది. ఒక దేశంలో సద్దుమణుగుతుంటే.. ఇంకో దేశంలో చెలరేగుతోంది. ఇలా అంతర్జాతీయంగా ‘పీస్’ కరవైంది. రష్యా-ఉక్రెయిన్ తర్వాత మొదలైన యుద్ధాలన్నీ ముగిశాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రస్తుతానికి అంతంత మాత్రంగానే ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆగడం లేదు. బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఇలా ప్రపంచ వ్యాప్తంగా అశాంతి నెలకొంది.
ఇలాంటి తరుణంలో ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా ప్రపంచంలో శాంతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం 2027లోనైనా ప్రశాంతమైన సంవత్సరం కావాలని అందరినీ వేడుకుంటున్నానన్నారు. ఖతార్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆదివారం మాట్లాడిన ఆయన.. ‘‘2022 ప్రపంచకప్ తర్వాత నాకు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఆ తర్వాత అక్టోబర్ 7 ఘటన జరిగింది. అప్పటి నుంచి ఎవరూ మాకు విరామం ఇవ్వడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ‘‘2027లో అయినా ప్రశాంతమైన సంవత్సరం కావాలని అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి.. మాకు కొంత విశ్రాంతి కావాలి’’ అని వేడుకున్నారు.
Also Read
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ప్రపంచకప్ తర్వాత..
2022లో ఖతార్ తొలిసారిగా మధ్యప్రాచ్యంలో ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. భారీ స్థాయి టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించగలదా? అంటూ అప్పట్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయని షేక్ మహమ్మద్ గుర్తు చేశారు. ‘‘మేము ప్రపంచకప్ కోసం బిడ్ వేసినప్పుడు.. ఎవరూ మీకు టోర్నమెంట్ ఇవ్వరు, ఎవరూ అవార్డు చేయరని చెప్పారు. మాకు ఆతిథ్యం దక్కిన తర్వాత కూడా టోర్నమెంట్ విఫలమవుతుందని అన్నారు. కానీ మేం అద్భుతమైన ప్రపంచకప్‌ను నిర్వహించాం. ఇప్పటికీ ప్రపంచం దాని గురించి మాట్లాడుతోంది’’ అని చెప్పారు. ప్రతి సంక్షోభం నుంచి ఖతార్ మరింత బలంగా బయటపడిందని, తమ ప్రజలకు, ప్రపంచానికి తమ సామర్థ్యాన్ని నిరూపించామని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచే శాంతి కరవైందన్నారు. అనంతరం 2023 అక్టోబర్ 7 తర్వాత అశాంతి నెలకొందన్నారు.
ఇరాన్‌ను ప్రాంతీయ సమస్యలకు కారణమయ్యే దేశంగా పరిగణించాలా? అని ప్రశ్నించగా ఖతార్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. తమ అనుభవం ప్రకారం ఇరాన్‌ను ‘శాంతి స్థాపకుడు’గా పరిగణించలేమని అన్నారు. అమెరికా-ఇజ్రాయెల్‌తో ఇరాన్ మధ్య జరిగిన యుద్ధానికి ప్రతిస్పందనగా ఈ ప్రాంతంలో ఇరాన్ సృష్టించిన పరిణామాలను తాము చూశామని, అవి ఇరాన్ శాంతి స్థాపకుడు కాదనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ప్రభావం గల్ఫ్ ప్రాంతంపై తీవ్రంగా పడుతోంది.. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే నౌకా రవాణా, ఇంధన సరఫరాలపై అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం ఖతార్ ఆర్థిక వ్యవస్థపైనా గణనీయంగా పడింది… ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ (LNG) ఎగుమతిదారుల్లో ఒకటైన ఖతార్.. యుద్ధం ప్రారంభమైన ఆరు నెలల్లో ఎల్ఎన్జీ ఎగుమతుల్లో 96 శాతం తగ్గుదల నమోదైనట్లు రాయిటర్స్ డేటా పేర్కొంది. ఈ పరిస్థితుల కారణంగా ఖతార్ సుమారు 24 బిలియన్ డాలర్ల గ్యాస్ విక్రయాలను కోల్పోయినట్లు సమాచారం. ఇది 2025లో ఆ దేశం ఆర్జించిన ఆదాయానికి దాదాపు ఐదు నెలల మొత్తానికి సమానమని నివేదికలు చెబుతున్నాయి. హార్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన అంతరాయాలతో పాటు ఖతార్‌కు చెందిన రెండు ఎల్ఎన్జీ ట్యాంకర్లపై జరిగిన దాడులు కూడా ఎగుమతులపై ప్రభావం చూపాయి. యుద్ధం ప్రారంభమైన ఆరు నెలల కాలంలో ఖతార్ కేవలం 18 ఎల్ఎన్జీ కార్గోలను మాత్రమే రవాణా చేసింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 509 కార్గోలను ఎగుమతి చేసింది. యుద్ధానికి ముందు ప్రపంచ ఎల్ఎన్జీ సరఫరాల్లో దాదాపు ఐదో వంతు ఖతార్ నుంచే వచ్చేది. ఖతార్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడటంతో ప్రపంచ గ్యాస్ మార్కెట్లలో ఒత్తిడి పెరిగింది. ఈ కొరతను కొంతవరకు అమెరికా నుంచి పెరిగిన గ్యాస్ సరఫరాలు భర్తీ చేస్తున్నాయని రాయిటర్స్ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో 2027లో అయినా ప్రశాంత వాతావరణం నెలకొనాలని ఖతార్ ప్రధాని చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
-
Sajjala Ramakrishna Reddy: డీఎస్సీ వివాదంపై సజ్జల సంచలన ఆరోపణలు..
-
Radha: 46 కోట్లు కొట్టేశారు.. సొంత అక్కపై పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన హీరోయిన్ రాధ!
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: నాని ‘ది ప్యారడైజ్’ పై సెన్సార్ కత్తెర.. ఏకంగా 21 కట్స్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!