Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameesha Patel: ‘కహో నా ప్యార్ హై’, ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ వంటి సినిమాలతో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న సీనియర్ నటి అమీషా పటేల్, నేటితరం బాలీవుడ్ హీరోయిన్ల నకిలీ స్టార్డమ్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత సొమ్ముతో విలాసాలు అనుభవించే కొందరు నటీమణుల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, చివరకు వాళ్ళ సినిమాల మొదటి రోజు బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఎక్కువగా ఉంటున్నాయని ఆమె ఎద్దేవా చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో నెటిజన్లతో ముచ్చటిస్తూ ఆమె ఈ ఘాటు విమర్శలు చేశారు. చాలా మంది హీరోయిన్లు తాము పెద్ద స్టార్లమనే భ్రమల్లో బతుకుతున్నారని, సినిమా షూటింగ్‌లు, ప్రమోషన్ల సమయంలో ప్రొడ్యూసర్ల ఖర్చులతో వారు మెయింటెన్ చేసే పర్సనల్ అసిస్టెంట్లు, మేకప్ టీమ్‌ల ఖర్చులు నిర్మాతలకు పెద్ద శాపంగా మారుతున్నాయని అమీషా పేర్కొన్నారు. ప్రొడ్యూసర్లు డబ్బులు పెట్టకపోతే, తమ రోజువారీ జీవితంలో ఇంతమంది స్టాఫ్‌ను మెయింటెన్ చేయగలరా అని ప్రశ్నించారు.
కెరీర్లో కనీసం ఒక పెద్ద సోలో హిట్ లేని కొందరు హీరోయిన్లు, కేవలం డబ్బులిచ్చి పిఆర్ (PR) టీమ్స్ ద్వారా తామే నంబర్ 1 అంటూ ఫేక్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారని తప్పుపట్టారు. ఇదే సెషన్లో తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, తాను ‘ఒకటి కొంటే ఒకటి ఉచితం’ ఆఫర్లతో వచ్చే తక్కువ స్థాయి సినిమాల్లో లేదా పనికిరాని వెబ్ సిరీస్‌లలో నటించనని స్పష్టం చేశారు. కొన్ని ఏళ్లకు ఒకసారైనా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ‘గదర్ 2’ లాంటి కల్ట్ సినిమాలే చేస్తానని ఆమె తేల్చి చెప్పారు. అమీషా పటేల్ 2000లో హృతిక్ రోషన్ సరసన ‘కహో నా ప్యార్ హై’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’, ‘హమ్రాజ్’, ‘భూల్ భులయ్యా’, ‘రేస్ 2’ వంటి సినిమాల్లో నటించారు. చాలా గ్యాప్ తరువాత 2023లో ‘గదర్ 2’తో సకీనా పాత్రలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన ‘బద్రి’లో నటించిన ఆమెకు ఇక్కడ కూడా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక అమీషా చేసిన తాజా వ్యాఖ్యలు బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ వెనుక అసలు కథ, నిర్మాతలపై పెరుగుతున్న అదనపు ఖర్చుల భారం ఎంతవరకు సమంజసం అనే చర్చకు దారితీశాయి.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Tags
- Ameesha Patel
- cinema
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు