కొరటాల శివ దరర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఏప్రిల్ 29 న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొన్న సంగతి విదితమే.. ఈ సందర్భంగా చిరంజీవి తన జీవితంలోని నిజమైన ఆచార్య ఎవరు అనేది చెప్పుకొచ్చారు.
” ఆచార్య అనేది ఒక గొప్ప పదం.. మీ నిజ జీవితంలో నిజమైన ఆచార్య ఎవరు” అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరు మాట్లాడుతూ ” నాకు నిత్య విద్యార్థిగా ఉండడం అనేది ఇష్టం. ఎందుకంటే అలా ఉంటేనే ఎక్కువ విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకొనే అవకాశం నాకు వస్తుంది. అందుకే అలా ఉండడమే ఇష్టపడతాను.. అలా అనిపించుకోవడానికి ఇష్టపడతాను. అయితే నిజ జీవితంలో నాకు ఎవరు ఆచార్య అంటే.. రోజు నాకు తారసపడే ప్రతి సంఘటన, ప్రతి వ్యక్తి, వారి నుంచి వచ్చే ప్రతి మాట.. అలాగే చిన్న చిన్న పిట్టకథలు దగ్గరనుంచి .. పెద్ద పెద్ద విషయాలు చెప్పే ప్రవచకులు ద్వారా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి ఒక్కరిలోనూ నేను ఆచార్యను చూస్తుంటాను, ప్రతి దాంట్లోనూ ఆచార్యను చూస్తుంటాను” అని చెప్పుకొచ్చారు.
https://www.youtube.com/watch?v=DEGvurpBJfM