Coolie : అమీర్ ఖాన్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటున్నారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమాలో ఆయన కీలక పాత్రలో మెరిశారు. అమీర్ ఖాన్ లాంటి బాలీవుడ్ అగ్రహీరో ఇలాంటి పాత్రకు ఒప్పుకోవడంపై చాలా చర్చ జరిగింది. అయితే ఈ పాత్ర కోసం అమీర్ రూ.20 కోట్లు తీసుకున్నాడంటూ ఎద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సినిమాలో కనిపించింది కొంత సేపే అయినా.. తనకున్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని అమీర్ ఖాన్ ఇంత తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు కనిపించాయి. కానీ దానిపై మొన్నటి వరకు అమీర్ ఖాన్ స్పందించలేదు. దీంతో ఇదే నిజం కావచ్చేమో అందుకే ఆయన సైలెంట్ గా ఉన్నారంటూ ప్రచారం మరింత పెరిగింది. చివరకు ఈ రూమర్లు అమీర్ ఖాన్ దాకా వెళ్లాయి. ఆయన ఎట్టకేలకు స్పందించారు.
Read Also : JR NTR – Vijay Decarakonda : జూనియర్ ఎన్టీఆర్, విజయ్ లకు వాటితో భారీ దెబ్బ..!
నేను రూ.20 కోట్లు తీసుకున్నాను అనేది ఒక రూమర్. నిజానికి నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. రజినీకాంత్ గారి మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమా చేశాను. ఆయనతో కలిసి సినిమా చేయడమే నాకు పెద్ద రెమ్యునరేషన్. అంతకు మించి నాకు వేరే ఏం వద్దు. ఇందులో నేను గెస్ట్ రోల్ మాత్రమే చేశాను. రజినీకాంత్, నాగార్జునలే మెయిన్ హీరోలు అంటూ చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. దాంతో ఆయన రెమ్యునరేషన్ రూమర్లకు చెక్ పడ్డట్టు అయింది. అయితే అంత పవర్ ఫుల్ రోల్ చేసినా సరే ఒక్క రూపాయి తీసుకోకపోవడం ఏంటని అంతా షాక్ అవుతున్నారు. ఈ రోజులు రెండు నిముషాల పాత్ర చేసినా కోట్లు తీసుకుంటున్నారు. అలాంటిది అమీర్ ఖాన్ ఫ్రీగా చేశాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే అంటున్నారు రజినీకాంత్ అభిమానులు.
Read Also : Chiranjeevi : చిరంజీవి ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ రోజే టీజర్..