సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. విడుదల కావాల్సిన సినిమాలు, సెట్స్ పై ఉన్న సినిమాలు దాదాపు నాలుగైదు ఉండగానే తాజాగా మరో చిత్రానికి ఆది సాయికుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ ఎంటర్ టైన్ మెంట్ సమర్పణలో కేవీ శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. శశికాంత్ దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించే ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తెలుగులో ఇప్పటి వరకూ ఎవరూ టచ్ చేయని వైవిధ్యమైన కథతో ఈ సినిమా ఉంటుందని దర్శకుడు శశికాంత్ చెబుతున్నారు.
Read Also : Tollywood : ఈ వీకెండ్ లో ఏడు సినిమాలు!
పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ”జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా” లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్రంలో బ్రహ్మాజీ, ‘సత్యం’ రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.