War2- coolie : ఈ నడుమ మూవీ రిలీజ్ డేట్లు ప్రకటించిన తర్వాత ఓ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. రిలీజ్ కు 50 రోజుల ముందు ఓ పోస్టర్ వేసేస్తున్నారు. 50 డేస్ టు గో.. 50 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్.. అంటూ పోస్టర్లు వేసేస్తున్నారు. అంటే మూవీ రిలీజ్ కు ఇంకో 50 రోజులే ఉంది అని ప్రేక్షకుల్లో మరోసారి దీని గురించి చర్చ జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించిన తర్వాత టీజర్లు, ట్రైలర్, సాంగ్స్ లాంటివి రిలీజ్ చేసేవాళ్లు. కానీ ఇప్పుడు 50 రోజులు ఉందని గుర్తు చేస్తూ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు.
Read Also : Kubera : కుబేరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. నిజమేనా..?
మొన్ననే కన్నప్ప సినిమాకు ఇలాంటి పోస్టర్ వేసేశారు. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ వార్-2కు 50 డేస్ ఉంది.. కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ ఓ పోస్టర్ ను పోస్ట్ చేశాడు. ఇప్పుడు కూలీ మూవీ టీమ్ ఇదే ట్రెండ్ ను ఫాలో అయింది. 50 డేస్ టు గో అంటూ పోస్టర్ ను వేసేసింది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఈ పోస్టర్లు వేసేశాయి.
గతంతో పోలిస్తే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సినిమాను తీయడం కంటే ప్రమోషన్లతో దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడమే ఇప్పుడు అసలు సవాల్. అందుకే ఈ రకమైన పోస్టర్లను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఈ 50 డేస్ పోస్టర్లలో కొత్త లుక్ ను కూడా రివీల్ చేస్తుండటం వల్ల వీటికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. మున్ముందు మరిన్ని సినిమాలు ఇదే ట్రెండ్ ను ఫాలో అవుతాయా లేదా చూడాలి.
Read Also : Pawankalyan : పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్న రెండు భారీ సినిమాలు ఇవే..