Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ కు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో ఎలాంటి మాస్ యాక్షన్ సినిమాలు లేవు. కేవలం కంటెంట్, పాత్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. మాస్ హీరో రోల్ చేసినా ఇంతటి పేరు రాదేమో అంటున్నారు స్టార్ హీరోలు. అయితే ఇంత మంచి సినిమాను ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారంట. దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వారెవరో కాదు మోహన్ లాల్, విజయ్ దేవరకొండ.
Read Also : Pawankalyan : పవన్ కల్యాణ్ మిస్ చేసుకున్న రెండు భారీ సినిమాలు ఇవే..
నాగార్జున పాత్ర కోసం ముందుగా మోహన్ లాల్ ను అడిగాడంట శేఖర్. కానీ ఆయన ఈ పాత్రపై పెద్దగా ఆసక్తి చూపించలేదంట. మళ్లీ ఓ సారి కథ చెప్పమని అడిగాడంట. కానీ అప్పటికే ఈ పాత్రను నాగార్జునతో చేయాలని ఫిక్స్ అవడంతో మోహన్ లాల్ ను మళ్లీ కలవలేదు. నాగార్జున కూడా ఈ పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చేశాడు.
అటు దేవా పాత్ర కోసం ధనుష్ కంటే ముందు విజయ్ దేవరకొండను అడిగాడంట శేఖర్ కమ్ముల. కానీ మాస్, స్టైలిష్ గా ఉండే తాను.. బిచ్చగాడి పాత్రకు సెట్ కానేమో అని చెప్పాడంట. దాంతో టాలీవుడ్ లో మరే హీరోను ఈ పాత్ర కోసం అడగకుండా ధనుష్ ను అడిగాడంట. ధనుష్ మాత్రమే ఇలాంటి పాత్రలు చేయగలుగుతాడు అనే నమ్మకంతో అడిగాడు శేఖర్. ధనుష్ కూడా ఒప్పుకోవడంతో మూవీని తీశారు. ఒకవేళ ఇందులో విజయ్ నటించి ఉంటే ఎలా ఉండేదో అని ఊహించుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్. కానీ చేసి ఉంటే విజయ్ కు నటన పరంగా మరో స్థాయి దక్కేది.
Read Also : Nani – Karthi : కార్తీ సినిమాలో నటిస్తున్న నాని..?