‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం థియేటర్లలో దూసుకెళ్తోంది. ఈ శుక్రవారం థియేటర్లలో తాప్సి ప్రధాన పాత్రలో నటించిన “మిషన్ ఇంపాజిబుల్” థియేటర్లలోకి రానుంది. థియేటర్ల సంగతి సరే… ఓటిటి విషయానికొస్తే ఈ వారం 3 కొత్త సినిమాకు ఓటిటిలో ప్రేక్షకులను అలరించబోతున్నాయి. ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధే శ్యామ్’, ‘హే సినామిక’ చిత్రాలు ఈ వారం డిజిటల్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి.
Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ
ముందుగా పాన్ ఇండియా మూవీ “రాధే శ్యామ్” గురించి మాట్లాడుకోవాలి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధేశ్యామ్”. ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చిత్రం మార్చ్ 11న థియేటర్లలోకి వచ్చింది. అయితే అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ పెద్దగా టైం తీసుకోకుండానే ఓటిటిలో విడుదలకు రెడీ అయ్యింది. ఏప్రిల్ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్ లో ‘రాధేశ్యామ్’ రిలీజ్ కానుందని ప్రకటించేశారు. ఇక శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “ఆడవాళ్లు మీకు జోహార్లు” ఏప్రిల్ 2న సోనీ లివ్‌లో ప్రీమియర్ అవుతుంది. ఇక మరో మలయాళ చిత్రం దుల్కర్ సల్మాన్, అదితి రావు, కాజల్ నటించిన ‘హే సినామిక’ మార్చ్ 31న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.