మనలో చాలామందికి జ్యోతిష్య శాస్త్రం, రాశిఫలాలు, గ్రహాల స్థితిగతుల గురించి తెలుసుకోవడం అలవాటు. ఏలినాటి శని ప్రభావం తమ రాశులపై ఎలా ఉంటుందోనని ఆసక్తిగా చదువుతారు. కొన్ని రాశులవారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారు స్వార్థంగా ఆలోచిస్తారని, అలాంటివారితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా నాలుగు రాశులవారు అభద్రతా భావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతరుల పట్ల దయను కలిగి ఉంటారు. తమ బాగోగులే ముఖ్యమని భావిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులు మీ చుట్టూ పక్కల ఉంటే అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు. ప్రతి విషయాన్ని నెగటివ్ యాంగిల్ లో చూసే ఈ రాశుల స్నేహం అంత కలిసి రాదు. ఈ నేపథ్యంలో ఏయే రాశులు ఈ విధంగా స్వార్థంగా ఆలోచిస్తుంటారో చూద్దాం. ఈ రాశులలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా మారే వారే ఎక్కువగా ఉంటారు. మోసపూరితంగా, స్వార్థంగా ప్రవర్తించేవారిని గమనించి వారికి అనుగుణంగా మనం వ్యవహరించాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల ప్రజలు ఈ లక్షణాలను కలిగి ఉంటారు. అది గ్రహసంచారం వల్లనే జరుగుతుందని గమనించాలి.
Read Also: Minister Ktr: నేడు, రేపు హస్తినలోనే కేటీఆర్.. ఢిల్లీలో న్యాయ నిపుణులతో భేటీ
మేషం..
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రాశి వారి ఆలోచనలు చాలా సున్నితంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. అంతేకాకుండా ఎంతో స్వార్థంగా ఆలోచిస్తుంటారు. చిన్న మాట అన్నా వెంటనే వీరు బాగా హర్ట్ అవుతారు. కాబట్టి వీరితో మాట్లాడేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిది. అంతేకాకుండా ఒక్కోసారి కావాలనే గొడవలు పడుతుంటారు. పాత విషయాలను ఎత్తి చూపుతూ మీ ప్రశాంతతను దూరం చేస్తారు. అవతలి వ్యక్తులు క్షమాపణ చెప్పినా త్వరగా అంగీకరించరు. వీరి మనస్తత్వం చాలా కఠినంగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వీరు జీవితములో రాణిస్తారు. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పుజల వలన సమస్యలను అధిగమించగలరు
వృషభం..
ఈ రాశి వారు సాధారణంగా అత్యంత ఆధిపత్య ధోరణిని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ తామే కచ్చితంగా ఉండాలని భావిస్తారు. తమ పంతం నెగ్గించుకోవడానికి ఎంతకైనా తెగిస్తారు. తాము పట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అనే తత్వం ఈ రాశివారికి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయంలో అంత త్వరగా రాజీ పడరు. ఇతరులు ఏమన్నా పట్టించుకోరు. తాము కావాలనుకున్న విషయాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. అంతేకాకుండా వీరికి కొంత అభద్రతా భావం ఎక్కువగా ఉంటుంది. స్వార్థ పూరిత ఆలోచనల వల్ల ఎక్కువ స్నేహితులు కాలేరు. వీరితో స్నేహం చేయడం, కలకాలం నిలుపుకోవడం అంటే కత్తిమీద సామే. అందుకే వీరు చాలా తక్కువమందితో సన్నిహితంగా మెలుగుతారు.
మిథునం..
మిథున రాశి వారు అందరితోనూ కలివిడిగా ఉంటారు. మోహమాటం లేకుండా ప్రవర్తిస్తారు. అంతేకాకుండా వీరి వ్యవహార శైలి అందరికంటే భిన్నంగా ఉంటుంది. మనిషిని బట్టి వీరి ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అంటే ఒక్కొక్కరితో ఒక్కోలా ఉంటారు. అందువల్లే వీరిని ఎలా నమ్మాలో అర్థం కాకుండా ఇబ్బంది పడతారు. వీరి వైఖరి వల్ల స్నేహితులు వీరి నుంచి దూరమవుతారు. ప్రతి విషయంలోనూ తమ మాట నెగ్గాలని అనుకుంటారు. తమ పంతం నెగ్గించుకునేందుకు పరిస్థితులు మార్చుకుంటారు.. అవసరమయితే వాటిని తమకు అనుకూలంగా మార్చేస్తారు.
కుంభం..
కుంభ రాశి వారు చాలా విచిత్రంగా ఉంటారు. వీరికి ఎమోషన్స్ పెద్దగా ఉండవు. అంతేకాకుండా వీరి ఎవర్నీ సులభంగా నమ్మరు. తమ చుట్టూ ఉన్నవారు స్వార్థపరులని, మంచివారు కాదని భావిస్తుంటారు. ఫలితంగా అందరికీ దూరంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి వారు మనుషుల మధ్య బంధాలను అంత సులభంగా ఏర్పరచుకోరు. తరచూ వివాదాలు, గొడవలతో కాలం గడుపుతారు. వీరు ఒకరిని నమ్మితే మాత్రం వారికోసం ఏదైనా చేస్తారు. ఈ తరహా మనస్తత్వం కలిగిన వారు గుర్తించడం కష్టం. ఈ రాశి వారు మీ మిత్రుల్లో ఉంటే వారిని గమనిస్తూ ముందుకు సాగడం మంచిది.
Read Also:Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష