Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nampally Court Verdict Life Imprisonment To Father Who Gets Daughter Pregnant: ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. మహిళలు & అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు మృగాల్లా విరుచుకుపడుతున్నారు. కొందరు కామాంధులైతే వావివరసలు మరిచి.. సొంత చెల్లెళ్లు, కూతుళ్లపైనే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఓ తండ్రి కూడా తన కూతురిపై ఇలాంటి దుశ్చర్యకే పాల్పడ్డాడు. భోజనంలో నిద్రమాత్రలు కలిపి.. లైంగిక దాడులకి పాల్పడి, గర్భవతిని చేశాడు. ఈ కేసులో నిందితుడికి కోర్టు సంచలన శిక్ష విధించింది. చచ్చేదాకా జైలులోనే ఉంచాల్సిందిగా తీర్పునిచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
NTR30: NTR30 నుంచి డబుల్ ధమాకా.. అదొక్కటే ఆలస్యం
Also Read
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ఆంధ్రప్రదేశ్‌కి చెందిన దంపతులు.. బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కి వచ్చారు. ఫిలింనగర్‌లోని ఒక అపార్ట్మెంట్‌లో పనికి కుదిరారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె(14) ఉన్నారు. కుమారుడు హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా.. కుమార్తె ఇంటి వద్దనే ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. కట్ చేస్తే.. ఒక రోజు ఆ అమ్మాయి తీవ్ర కడుపునొప్పితో బాధపడటంతో, 2021 జూలైలో తల్లి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లింది. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె మూడు నెలల గర్భవతి అని తేల్చారు. దీంతో కోపాద్రిక్తురాలైన తల్లి.. ఈ పని ఎవరు చేశారని కూతురిని నిలదీసింది. తండ్రే తనపై అత్యాచారం జరిపాడని ఆ బాలిక తెలిపింది. భోజనంలో నిద్రమాత్రలు కలిపి, తనపై లైంగిక దాడి చేసేవాడని చెప్పింది.
Jr NTR: ప్లేటు తిప్పేసిన ఆ డైరెక్టర్.. తారక్ ఫ్యాన్స్ ఆశలు గల్లంతు
కుమార్తె చెప్పిన మాటలతో ఖంగుతిన్న తల్లి.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. ఈ కేసుని విచారించిన నాంపల్లి 12వ అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టీ. అనిత.. నేరం రుజువు కావడంతో తండ్రికి కఠిన శిక్ష విధించారు. జీవితకాలం జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించారు. నిందితుడిని మరణించే వరకు జైల్లోనే ఉంచాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే.. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం అందించాలని మండల్ లీగల్ సర్వీస్ అథారిటీని న్యాయస్థానం ఆదేశించింది.
Ravichandran Ashwin: చరిత్ర సృష్టించిన అశ్విన్.. ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!