health: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎందుకంటే ఏది కోల్పోయిన తిరిగి సంపాదించుకోగలం. కానీ ఆరోగ్యం ఒకసారి దెబ్బతింటే తిరిగి మామూలస్థితికి రావడం చాలా కష్టం. అందుకే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం కాదు. ఆ ఆహారాన్ని ఆరోగ్యకరంగా తీసుకోవడం ముఖ్యం. అంటే ఏది తిన్న మితంగా తినాలి. మోతాదు మించితే ఔషధం కూడా విషమే అవుతుంది. ఇలాంటి పాదార్ధాల జాబితాలోకి వస్తుంది ఎండు ద్రాక్ష.
Read also:UP Police: ఉత్తరప్రదేశ్ ఘటన.. తుపాకీతో పారిపోబోయిన నిందితులు.. కాళ్లపై కాల్చిన పోలీసులు
ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు ఎండు ద్రాక్ష తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తాన్ని వృద్ధి చేస్తుంది. దీని వల్ల రక్తహీనత తగ్గుతుంది. జీర్ణ్య వ్యస్థని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. ఎసిడిటీని తగ్గిస్తుంది. కానీ మోతాదుకు మించి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎండు ద్రాక్షలో సహజంగానే చక్కెర స్థాయి అధికంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం వచ్చే అవకావం ఉంది. కనుక డయాబెటిస్ ఉన్నవాళ్లు మరియు వచ్చే అవకాశం ఉన్నవాళ్లు ఎండు ద్రాక్ష తినకపోవడమే మంచిది. అలానే ఎక్కువగా తినడం వల్ల దంత సమస్యలు వచ్చే అవకాశం వుంది. అలానే వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అద్ధికంగా తినడం వల్ల జీర్ణకాదు, అలానే విరోచనాలు అయ్యే అవకాశం ఉంది. కనుక ఎండుద్రాక్షను మోతాదు మించి తీసుకోకూడదు. అలా తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. అందుకే ఏదైనా లిమిట్ గా తినాలి. లిమిట్ దాటితే అమృతం కూడా విషమే అవుతుంది.