Peta: ప్రపంచంలో ఎంత శాఖాహారులు ఉన్నారో అంతకు మించి మాంసాహారులు ఉన్నారు అన్నది నమ్మలేని నిజం. అయితే మాంసాహారం ఆరోగ్యానికి ఎంత మంచిదో అంతే చెడ్డది అని చెప్తున్నారు వైద్యులు. ఆహరం ఏదైనా మితంగా తింటే ఔషధం.. అమితంగా తింటే విషమని పెద్దలు చెప్తారు. ఎవరు ఏది చెప్పినా మేము వినం.. ముక్క లేనిదే ముద్దా దిగదు అని చెప్పేవారు ఇంకొంతమంది.. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మూగజీవాల పరిరక్షణ సంస్థ పెటా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మాంసాహారులు వలనే సమాజంలో మూగజీవులు అంతమైపోతున్నాయనేది వారి వాదన. ఇక ప్రతి ఒక్కరిని శాకాహారులుగా మార్చడం కోసం పెటా ఎన్నో పాట్లు పడుతోంది. ఆ సంస్థ ఎంత చెప్పిన తమ తీరు తమదే అన్నట్లు ప్రవరిస్తున్నారు మాంసాహార ప్రేమికులు. ఇక దీంతో పెటా ఒక అడుగు ముందుకు వేసి మగవాళ్ల వీక్ నెస్ మీద పడింది.
ముక్క తినే మగాళ్లతో అమ్మాయిలు శృంగారం చేయకండి అంటూ పోస్ట్ పెట్టింది. “చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. దానివలన మూగజీవాలకు ఎంత హాని కలుగుతుందో వారికి తెలియదు. అలా మాంసాహారాన్ని ఎంజాయ్ చేసేవారితో శృంగారానికి నో చెప్పండి” అని రాసుకొచ్చింది. ఇక దీంతో మగవాళ్లు కామెంట్స్ తో విరుచుకుపడ్డారు. మగవారు లేకపోతే అసలు ప్రపంచమే లేదు.. అని కొందరు.. కేవలం మగవాళ్ళు మాత్రమే మాంసం తింటున్నారా..? ఇందులో ఎందుకు జెండర్ ఈక్వాలిటీ అని మరికొందరు విరుచుకుపడుతున్నారు. ఇంకొందరు పెటా ప్రచారంలో వాస్తవమే లేదని తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.