Do Not Eat These Things In Monsoon: వేసవి కాలం ముగిసింది. వర్షాకాలం సీజన్ ఆరంభం అయింది. వర్షాకాలంలో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఓ వ్యక్తి తరచుగా అనారోగ్యానికి గురవుతాడు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వ్యాధులు అటాక్ అవుతాయి. అందుకే ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు కొందరు వర్షాకాలం సీజన్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకుంటారు. దాంతో కూడా మీ ఆరోగ్యం పాడవుతుంది. ఈ నేపథ్యంలో మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఆహరం ఏంటో ఇప్పుడు చూద్దాం.
సీ ఫుడ్స్:
వర్షాకాలంలో సీ ఫుడ్స్ తీసుకోవడం తగ్గించేయాలి. సీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం మార్కెట్‌లో లభించే చేపలు తాజాగా ఉండవు. కొన్ని చనిపోయి ఉంటాయి. వాటిని మీరు తీసుకుంటే.. ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.
ఆకు కూరలు:
వర్షాకాలంలో వీలైనంత వరకు ఆకు కూరలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆకు కూరల్లో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువ. వర్షాకాలంలో పాలకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలికూర లాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది.
Also Read: Asia Cup 2023: టీమిండియాకు శుభవార్త.. ఆసియా కప్ 2023లో కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా!
పాల ఉత్పత్తులు:
వర్షాకాలంలో పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో వీటిల్లో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కడుపు సంబంధిత వ్యాధులు కూడా ఇబ్బంది పెడతాయి.
వేయించిన ఆహరం:
వర్షాకాలంలో వేయించినవి మంచి రుచిగా ఉంటాయి. అయితే ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. వాటిని తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. విరేచనాలు, వాంతులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వర్షాకాలంలో వేయించిన ఆహరం తినకూడదు.
Also Read: Asian Games 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్! జట్టులోకి తెలుగు ఆటగాడు