భారతీయ రైల్వేస్ న్యూస్ ప్రయాణీకులకు షాకిచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కావాల్సిన.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ క్లాస్ లాంచ్ ను వాయిదా వేసినట్లు తెలిపింది రైల్వే శాఖ. అయితే ప్రస్తుతం దీన్ని కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తున్నామని.. వచ్చే డిసెంబర్ లో తిరిగి ప్రారంభిస్తామని రైల్లే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు.
పూర్తి వివరాల్లోకి నవంబర్ లో ప్రారంభం కావాల్సిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ లాంచ్ వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని స్వయంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. అయితే.. బోగీలు, సీట్లు, ప్రయాణీకుల సౌకర్యాలకు సంబంధించి కొన్ని మార్పులు చేయాల్సి ఉందని.. రైలును పరిక్షించే సమయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి వేగంగా పనులు పూర్తవుతున్నాయని.. డిసెంబర్ లోగా వందే భారత్ రైళ్లు పట్టాలెక్కుతాయని రైల్వే మంత్రి తెలిపారు.
చిన్న చిన్న మార్పులే అయినప్పటికి .. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేసే BEML, ప్రోటోటైప్ రేక్‌ను రెట్రోఫిట్టింగ్ కోసం తమకు తిరిగి ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. రైల్వే భద్రతా కమిషనర్ పర్యవేక్షణలో వందే భారత్ స్లీపర్ కు టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు. రైళ్లలో కొత్త AC డక్ట్ లొకేషన్లు, అగ్ని భద్రత కోసం ఆర్క్-ఫాల్ట్ డిటెక్షన్ పరికరాలు, CCTV కోసం ఫైర్-సర్వైవల్ కేబుల్స్, యూరోపియన్ ఫైర్, క్రాష్ ప్రమాణాలకు వ్యతిరేకంగా థర్డ్-పార్టీ ఆడిట్‌లు, అత్యవసర అలారం బటన్‌ల కోసం కొత్త స్థానాలు వంటి అనేక ముఖ్యమైన మార్పులు ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో మొట్టమొదటి వందే భారత్ రైలు స్లీపర్ కోచ్ నిర్వహణ సౌకర్యం 2026 మధ్య నాటికి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సిద్ధంగా ఉంటుందని.. నార్త్ వెస్ట్రన్ రైల్వే సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ అమిత్ స్వామి తెలిపారు.