ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు పెళ్లిళ్లు కావాలంటే ఎంతో కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో అమ్మాయిలకు సంబంధాలు చూడాలంటే.. అమ్మాయిల తల్లిదండ్రులు ఎంతో కష్ట పడాల్సి వచ్చేది.. అమ్మాయికి ఎదో వంక పెట్టి క్యాన్సిల్ చేసుకునేవారు. అయితే.. కాలం మారిపోయింది.. ఇప్పుడు అబ్బాయిని చేసుకోవాలో వద్దో అన్న డిసిజన్ అమ్మాయిలే తీసుకుంటున్నారు. అయితే ఉత్తర ప్రదేశ్ లో ఓ యువకుడు అమ్మాయికి ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. కానీ.. పెళ్లయిన కొన్ని గంటలకే అమ్మాయి కనిపించకుండా పోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Also: TG News: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక మలుపు..
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బారంబాకీలో ఓ పెళ్లి కొడుకు.. వధువుకు ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. మూడెకరాల పొలం అమ్ముకుని.. పెళ్లికూతరికి బంగారు నగలు, చీరలు అన్ని కొనిచ్చాడు. పెళ్లి తంతు ముగిసి బరాత్ నిర్వహించారు బంధువులు.. బరాత్ ఫుల్ జోష్ లో ఎంజాయి చేసింది పెళ్లికూతరు. చూసినవాళ్లంతా పెళ్లి కూతరు ఎంత ఆనందంగా ఉందో అని సంబరపడ్డారు. కాసేపటికే .. వధువు వరుడికి దిమ్మ దిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది. అయితే. .పెళ్లి మండపంలో వధువు కనిపించకుండా పోయింది. ఎంత సేపు వెతికినా కనిపించకపోయే సరికి బంధువులంతా కలిసి పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లవ్ ఎఫైర్ లాంటివి ఏమైనా ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:The Family Man : ఫ్యామిలీమ్యాన్ సిరీస్ ఫస్ట్ ఛాయిస్ చిరంజీవి అని తెలుసా..?
అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎదురు కట్నం ఇచ్చినా.. అమ్మాయి వెళ్లిపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు నెటిజన్లు.. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలని.. వరుడికి ఇది చాలా పెద్ద అవమానం అని.. అతడి సానుభూతి వ్యక్తి చేస్తున్నారు నెటిజన్లు.
दुल्हन गुम… विदाई से ठीक पहले हुआ हाई-वोल्टेज ड्रामा! शादी की सारी रस्में पूरी, फेरे हो गए, दुल्हन संग बारात नाची, बैंड बजे… लेकिन जैसे ही विदाई का पल आया—दुल्हन पल्लवी हवा हो गई!
💥 पूरा मामला फ़िल्मी, लेकिन केस असली!
UP के बाराबंकी में दूल्हा सुनील गौतम 90 बारातियों और 11… pic.twitter.com/grdWeteBaY
— TRUE STORY (@TrueStoryUP) November 20, 2025