ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో ఒక భాగమైపోయింది. అంతేకాకుండా ఇప్పుడు అది కూడా మన శరీరంలో భాగమైపోయింది. వాటర్ బాటిల్, టీ కప్పు, పేపర్ ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్ తో ముడిపడింది. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం మానవ జాతి మనుగడకే పెనుముప్పుగా మారింది. ప్లాస్టిక్‌లోని అతి చిన్న రూపమైన ప్లాస్టిక్ కణాలు గాలిలో చేరుతున్నాయి. మనం తీసుకునే ఆహారం, పానీయాలలో నీరు కలుపుతారు. ప్లాస్టిక్ వ్యర్థ కణాలు గాలి, నీరు, ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తు్న్నాయి. దీంతో గుండె, మెదడు, మూత్రపిండాలు, కాలేయం వంటి శరీరంలోని ప్రతి అవయవంపై హానికరమైన ప్రభావాలను చూపుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు.. మనిషి ఆరోగ్యంపై అనేక రకాలుగా చెడు ప్రభావం చూపుతున్నాయి. హానికరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలలోకి పాకుతుంది.
Read also: Fraud Case : లైన్ మెన్ ఉద్యోగం ఇప్పిస్తానని రూ. 9 లక్షలు వాసులు చేసిన కార్పొరేటర్..
ఇదిలా ఉంటే పురుషుల వృషణాల్లో మైక్రోప్లాస్టిక్ కణాలను యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు గుర్తించారు. స్పెర్మ్ సెల్స్‌లో కూడా ఈ ప్లాస్టిక్ పార్టికల్స్ ఉంటాయని చైనా పరిశోధకులు తేల్చారు. చైనాలోని 36 మంది ఆరోగ్యవంతమైన యువకుల స్పెర్మ్‌ను ప్రయోగశాలలో పరీక్షించగా, అన్ని నమూనాలలో మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు కనుగొని షాక్ తిన్నారు. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, బ్యాగుల తయారీలో ఉపయోగించే పాలీ ఇథిలిన్, పాలీ వినైల్ క్లోరైడ్, పాలీ స్టైరిన్ వంటి కణాలను వీర్యంలో గుర్తించినట్లు పరిశోధకులు తెలిపారు. ప్లాస్టిక్ కణాలు సంతానోత్పత్తికి కీలకమైన స్పెర్మ్ కణాల కదలికను అడ్డుకుంటున్నాయని పరిశోధనల్లో వెలువడింది. ఇక స్పెర్మ్ కణాల పెరుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటలీలో నిర్వహించిన మరో అధ్యయనంలో, పురుషుల స్పెర్మ్ కణాలలో మైక్రోప్లాస్టిక్‌లు కనుగొనబడినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పురుషుల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నందున ప్లాస్టిక్‌కు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు.
Gold Price Today : గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..