అతి భయంకరమైన వ్యాదులల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలోని కణాలు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల క్యాన్సర్ వస్తుంది. దీనిని తెలుగులో ‘కర్క రోగం’ అంటారు. క్యాన్సర్ రావడానికి ధూమపానం, ఎక్కువగా మద్యం తాగడం, ఎండలో ఎక్కువగా తిరగడం, ఊబకాయం, అసురక్షిత లైంగిక సంబంధం ఇలా అనేక కారణాలు ఉంటాయి. అలాగే క్యాన్సర్ రావడానికి ముందు శరీరం కూడా సంకేతాలు చూపిస్తుంది. ఆహారం తీసుకునే సమయంలో అసౌకర్యం గొంతులో నొప్పి, తిన్న ఆహారం గొంతులో ఉన్నట్లు అనిపిస్తే క్యాన్సర్ కు దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఎప్పుడో ఒకసారి అనిపిస్తే ప్రమాదం ఏమీ లేదు. కానీ తరచుగా అలాగే అనిపిస్తే మాత్రం అధిక కాన్సర్ కు దారి తీసే అవకాశం ఉంటుందట. ఫలితంగా తల, మెడ, దవడ ప్రాంతాల్లో క్యాన్సర్ కణితిలను పెరిగే ప్రమాదం ఉంది. అయితే షుగర్ తిన్నా కూడా క్యాన్సర్ వస్తుందట.. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
– స్వీట్, షుగర్ ఇష్టపడని వారంటూ ఉండరు. కానీ స్వీట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు పెరుగుతారు. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. అధిక బరువు, ఊబకాయం క్యాన్సర్ ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే చక్కెర తినడం వల్ల శరీర జీవక్రియపై ఇది నెగిటివ్ప్రభావం చూపిస్తుంది. అంతే కాదు షుగర్స్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయి పెరిగి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి క్యాన్సర్‌లు వేగంగా వ్యాపిస్తాయి. షుగర్ కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడేస్తోంది కనుక షుగర్ తినడం తగ్గించాలి.
– చాలా మంది ఉదయం లేవగానే ముందు కాఫీ లేదా టీ తోనే డే మొదలెడతారు. టీ పడితే కానీ పని మొదలుపెట్టారు. అలాంటి వారు బెల్లం తో చేసిన టీ అలవాటు చేసుకోండి. బెల్లం తినడం వల్ల బాడీకి ఐరన్ అందుతుంది. చక్కెరను మాత్రమే కాదు మనం తినే బియ్యం, చపాతీలు కూడా చక్కెర లా పనిచేస్తాయి. కనుక ఏం తిన్నా కూడా తగిన మోతాదులో తినండి.
– చక్కెరతో కూడిన ఆహార పదార్థాలను దూరం పెడితే నోటీ సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. అలాగే టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా చాలా తగ్గుతుంది. మూడ్ స్వింగ్స్, చిరాకు, కోపం తగ్గుతుంది. చర్మం త్వరగా ముడతలు పడకుండా కాంతివంతంగా మారుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపుబ్బరం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
– చక్కెరతో తయారు చేసిన పానీయాలు, స్వీట్లు, ఇతర పదార్థాలు తినడం మానేస్తే, శరీరంలోకి అధికంగా చేరే కేలరీల పరిమాణం తగ్గుతుంది. దీని వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. చక్కెరను దూరం పెట్టడం వల్ల హైబీపీ, గుండె జబ్బులు సహా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది. అకనుక మంచి ఆరోగ్యం పొందటంకోసం షూగర్ ని పక్కన్న పెట్టడి.