కంటిచూపు సమస్య రావడానికి కారణం.. కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం. అంతే కాకుండా.. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా కళ్లపై ప్రభావం పడుతుంది. దీంతో.. క్రమంగా చూడడంలో ఇబ్బంది ఎదుర్కోవలసి వస్తుంది.
ఈ రోజుల్లో జీవనశైలి, ఆహారపు అలవాట్లు కళ్లను ప్రభావితం చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లు ఇతర గాడ్జెట్‌ల కారణంగా కంటి చూపు దెబ్బతింటోంది. అటువంటి పరిస్థితిలో పోషకాలు ఉండే పదార్థాలు తినడం మంచిది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాల పోషకాలు ఉన్నాయి.
మనం ఏమీ చూడాలన్నా కళ్లు ప్రధానం. కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటే.. మనం కూడా అంతే ఆరోగ్యంగా అన్ని పనులు చేసుకో గలుగుతాము. అయితే మారిన ప్రస్తుత జీవన విధానంలో చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు కంటి సమస్యలు ఉంటున్నాయి.