బేబీ కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు.. వీటితో రకరకాల వంటలను తయారు చేస్తారు.. అవి రుచిగా ఉండంతో పాటుగా ఆరోగ్యం కూడా..రెగ్యులర్ కార్న్‌తో పోలిస్తే చిన్నవిగా, మొగ్గ దశలో ఉండే బేబీ కార్న్‌లో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు , కొవ్వు తక్కువగా ఉంటాయి. మన డైట్‌లో తరచుగా బేబీ కార్న్ చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బేబీ కార్న్‌లో మన ఆరోగ్యానికి మేలు చేసే.. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ముఖ్యంగా థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్ వంటి బి గ్రూప్ విటమిన్లు మెండుగా ఉంటాయి. B గ్రూప్ విటమిన్లు మన శరీర శక్తికి మద్దతు ఇవ్వడానికి కీలక పాత్ర పోషిస్తాయి, నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడతాయి. బేబీ కార్న్‌లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా మెండుగా ఉంటాయి.. అంతే కాదు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఇక వీటిలో బీటా-కెరోటిన్, విటమిన్ సి ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో, ఆక్సీకరణ ఒత్తిడిని, మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
అంతేకాదు.. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.. బేబీ కార్న్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియలో సహాయపడుతుంది, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మీ కడుపును నిండుగా ఉంచి, ఎక్కువగా తినకుండా నిరోధిస్తుంది.. బరువు తగ్గాలని అనుకొనేవారికి ఇది బెస్ట్ అని వైద్యులు చెబుతున్నారు..షుగర్ పేషెంట్స్ వారి డైట్‌లో బేబీ కార్న్ కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. బేబీ కార్న్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగడం, పడిపోవడాన్ని నివారిస్తుంది… షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.. సో బేబీ కార్న్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు..