నాన్ వెజ్ ప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా సరే మాంసాహారం తినాల్సిందే.. మరికొంతమందికి రోజూ ముక్క లేకుండా ముద్ద దిగదు.. అయితే ఇలాంటి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎముకలకు బలాన్ని ఇస్తుంది.. అదే ఎక్కువగా తీసుకుంటే అనారోగ్యానికి గురవుతాయి.. చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచడంతో పాటు గుండె నాళాలను దెబ్బతీస్తుంది. ఫలితంగా గుండె జబ్బులను బారిన పడే అవకాశం ఉంటుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి అన్న విషయం అందరికీ తెలిసిందే.. మాంసంలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే..
అదే విధంగా రెడ్ మీట్లో పాస్పరస్, క్యాల్షియం నిష్పత్తి అధికంగా ఉంటుంది. ఇది ఎముకల్లోని కాల్షియం కోల్పోయే స్థితిని అధికమయ్యేలా చేస్తుంది. దీని ఫలితంగా మినరల్ రహితంగా ఎముక మారిపోతూ ఉంటుంది. రెడ్ మీట్ అధికంగా తినే వారిరక్తంలో ఆమ్లత్వం అధికమవుతుంది. దీని వలన కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించలేదు… ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై ద్రవ ప్రభావం పడి అవి బలహీనంగా మారే అవకాశం ఉంటుంది.. అందుకే ఏదైనా మితంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మాంసంకు బదులుగా పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఇంకా ఎన్నో పోషకాలు అందుతాయని చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.