రోజూ బెల్లం నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం చక్కెర పదార్థం కాదు. చెరకు రసం నుంచి తయారయ్యే బెల్లంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఆహారం తర్వాత బెల్లం తీసుకునే అలవాటు చాలా మందికి ఉంది. ముఖ్యంగా బెల్లం నీటిని రోజూ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని న్యూట్రిషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
బెల్లం నీరు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో, అలాగే కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఏడు రోజుల పాటు బెల్లం నీరు తాగినా రక్తశుద్ధిలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, బెల్లం నీరు చర్మానికి కూడా మేలు చేస్తుంది. గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం వల్ల మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
బెల్లంలో ఉన్న ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బెల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటమే కాకుండా ఫ్యాటి లివర్ వంటి సమస్యలు కూడా తగ్గడానికి తోడ్పడుతుంది. మహిళలకు బెల్లం నీరు సహజ వైద్యం వంటిదిగా పనిచేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి, బలహీనత, మానసిక స్థితి మార్పులను తక్కువ చేయడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం జీర్ణక్రియను గణనీయంగా మెరుగుపరుస్తుంది.
ఈ వివరాలు ఇంటర్నెట్ ద్వారా సేకరించినవి మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి బెల్లం నీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలనుకుంటే, ముందుగా మీ వైద్యుడిని లేదా న్యూట్రిషన్ నిపుణుడిని సంప్రదించడం మంచిది.