మనకు రోజూ లభించే కూరగాయల్లో అనేక పోషక విలువలు, శరీరానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉంటాయి. ప్రతి కూరగాయలో శరీరానికి, ఆరోగ్యానికి మంచి చేసే అనేక విటమిన్లు, శక్తిని అందించే పదార్థాలు ఉంటాయి. కూరగాయలను తినడం ద్వారా శరీరానికి బలంతో పాటు పౌష్టిక విలువలు లభిస్తాయి. అలా మనకు లభించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పదార్థాలు ఉన్నాయి.
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు భయపడి బయటకు పోవాలంటే నరకం కనపడుతుంది. కొద్దిసేపు ఎండకు తిరగారంటే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి జలదాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్‌గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది.
వేసవి కాలంలో రానున్న రోజుల్లో వేడిగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. శరీరాన్ని చల్లగా, కాలానుగుణ వ్యాధుల నుండి రక్షించడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.