APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
APMDC: ఆంధ్రప్రదేశ్లో ఖనిజ వనరుల వినియోగం, మైనింగ్ రంగ అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. మైనింగ్ శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఆదాయాన్ని పెంచేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీఎండీసీ పరిధిలో ఉన్న ఖనిజ వనరుల విలువ సుమారు రూ.7.8 లక్షల కోట్లుగా ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. ఏపీఎండీసీని మరింత బలోపేతం చేసే దిశగా వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి సంస్థను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసి ఐపీవోకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీఎండీసీ ఈక్విటీ విలువను రూ.86,290 కోట్లుగా అంచనా వేశారు. దీనికి అనుగుణంగా అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు సీఎం చంద్రబాబు.
అలాగే రాష్ట్రంలో అరుదైన ఖనిజ వనరుల అన్వేషణ, అభివృద్ధి కోసం ఏపీ రేర్ ఎర్త్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో కీలక ఖనిజ వనరులపై పట్టు సాధించేందుకు విదేశాల్లో ఉన్న కీలక ఖనిజ మైనింగ్ ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో ఖనిజ నిక్షేపాల గుర్తింపు కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏఐ ఆధారంగా 582 ఖనిజ అన్వేషణ ప్రాంతాలను గుర్తించారు. మరోవైపు రాష్ట్రంలోని మూడు బొగ్గు బ్లాకుల్లో మొత్తం 1,774.6 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సమీక్షలో వెల్లడైంది. ఇక, మైనింగ్ రంగం ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచేందుకు పెండింగ్లో ఉన్న క్వారీ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ దరఖాస్తుల పరిష్కారం ద్వారా సుమారు రూ.400 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఖనిజ వనరుల అన్వేషణ నుంచి మైనింగ్ కార్యకలాపాలు, అంతర్జాతీయ పెట్టుబడుల వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Also Read
- Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
- AP MPP Election Results: ఎంపీపీ ఎన్నికల్లో పార్టీల బలమెంత? అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాల పూర్తి లెక్కలివే!
- Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
- TDP ZP Chairman and Vice Chairman Candidates List: టీడీపీ జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభ్యర్థుల పూర్తి జాబితా ఇదే..!
తాజావార్తలు
-
APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
-
KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
-
Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
-
Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
-
Hanuman Ansh: రూ.452 కోట్లు కొల్లగొట్టినా ఎవరూ పట్టించుకోలేదు.. ‘హనుమాన్ అంశ్’ డైరెక్టర్ అసంతృప్తి!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!