Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Glenn Phillips World Record: న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. భారత్‌తో వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ పూర్తి చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 87వ ఓవర్ రెండో బంతికి మూడు పరుగులు తీసిన ఫిలిప్స్.. తన శతకాన్ని అందుకున్నాడు. దీంతో ఒకే ప్రత్యర్థి జట్టుపై మూడు ఫార్మాట్లలోనూ (వన్డే, టీ20, టెస్టు) సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. అంతేకాదు ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒకే జట్టుపై వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో భారత్‌పై వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా కూడా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒకే జట్టుపై వన్డే, టీ20, టెస్టు ఫార్మాట్లలో సెంచరీలు చేయడం అంటే ఎంతో ప్రత్యేకం. ఇప్పటివరకు ఈ ఘనత సాధించింది ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఒకే జట్టుపై మూడు ఫార్మాట్లలో శతకాలు బాదిన మొదటి ప్లేయర్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మనే. 2017లో శ్రీలంకపై వన్డే, టీ20, టెస్టులో సెంచరీలు చేశాడు. 2026లో భారత్‌పై గ్లెన్ ఫిలిప్స్ శతకాలు బాదాడు. 2026 జనవరి 18న ఇండోర్‌లో భారత్‌తో జరిగిన మూడో వన్డేలో ఫిలిప్స్ సెంచరీ (106) బాదాడు. అక్టోబర్ 30న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన నాలుగో టీ20లోనూ శతకం (107) చేశాడు. నవంబర్ 20న వెల్లింగ్టన్ టెస్టులో మూడంకెల స్కోర్ (118) అందుకున్నాడు.
Also Read
- IND vs NZ: నికోల్స్ అజేయ సెంచరీ.. ఫిలిప్స్ శతకం.. తొలి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ ఆలౌట్!
- WTC 2025-27 Points Table: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం.. మారిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎక్కడంటే!
- Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
- Henry Nicholls: భారత్‌పై పోరాటం.. భార్య పుట్టినరోజునే సెంచరీ.. హెన్రీ నికోల్స్ ఎమోషనల్ కామెంట్స్!
ఒకే ప్రత్యర్థి జట్టుపై మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై రోహిత్ మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించాడు. కేఎల్ రాహుల్ వెస్టిండీస్, ఇంగ్లాండ్‌పై ఈ ఘనత అందుకోగా.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌పై మూడు ఫార్మాట్లలో శతకాలు బాదాడు. తిలకరత్నే దిల్షాన్ ఆస్ట్రేలియాపై, షేన్ వాట్సన్ భారత్‌పై, క్రిస్ గేల్ ఇంగ్లాండ్‌పై, మహమ్మద్ రిజ్వాన్ దక్షిణాఫ్రికాపై, షాయ్ హోప్ భారత్‌పై మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో గ్లెన్ ఫిలిప్స్ కూడా చేరాడు.
తాజావార్తలు
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
PUC New Rules 2026: కారు, బైక్ యజమానులకు గుడ్ న్యూస్.. ఇక 3 ఏళ్ల వరకు PUC రెన్యువల్ అవసరం లేదు!
-
Cyclone Akvan: అక్వాన్ తీవ్ర తుపాన్ తీరం దాటే ప్రక్రియ ప్రారంభం.. వణుకుతున్న ఉత్తరాంధ్ర.. కీలక హెచ్చరిక!
-
Home Decor Ideas: పాత ప్లాస్టిక్ కుర్చీలను పనికిరావని పడేస్తున్నారా? ఇలా చేస్తే అస్సలు పడేయరు!
-
Devuthani Ekadashi 2026: నేడు దేవుని ఉత్థాన ఏకాదశి.. ఈ 5 తప్పులు చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట..!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!