Rahul Gandhi: ప్రపంచ రాజకీయాల్లో భారత్ ‘‘సైడ్ ప్లేయర్’’.. రాహుల్ ‘‘పాక్ ఫ్యాన్ బాయ్’’ అంటూ బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ క్రమంగా తన ప్రాధాన్యత కోల్పోతోందని కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అంతర్జాతీయ దౌత్య చర్చల్లో భారత్ ‘‘సైడ్ ప్లేయర్’’గా మారిందని అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగడానికి పాకిస్తాన్ చర్చలు జరుపుతుంటే భారత్ మాత్రం పక్కన ఉండిపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. బుధవారం చికాగో యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఒకప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్‌కు లోతైన అవగాహన ఉండేదని, ప్రపంచ పరిణామాలను ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషించేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని విమర్శించారు. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంటే, భారత్‌కు అమెరికా, రష్యా, ఇరాన్‌తో సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని దౌత్యపరంగా ప్రభావం చూపించడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్ని కూడా రాహుల్ గాంధీ విమర్శించారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నేతలతో వ్యక్తిగత స్నేహ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ప్రశ్నించారు. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు నేతల వ్యక్తిగత స్నేహాల ఆధారంగా నిర్ణయించబడవని, వాటిని ఆర్థిక వ్యవస్థలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు ప్రభావితం చేస్తాయని అన్నారు.
Also Read
- CM Yogi Adityanath: సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం.. 91 ఏళ్ల వయసులో తల్లి కన్నుమూత
- Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
- Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
- SCO Forum 2026: నేడు తొలి SCO ఫోరమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
అయితే, రాహల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. విదేశీ గడ్డపై భారత్‌ను అప్రతిష్టపాలు చేస్తు్న్నారని మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆయనను ‘పాకిస్థాన్ ఫ్యాన్ బాయ్’గా అభివర్ణించారు. బీజేపీ మరో అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ స్పందిస్తూ.. రాహుల్ వ్యాఖ్యలు క్షమించరానివి అని, పాకిస్తాన్‌కు ఉత్సాహంగా మద్దతు పలికే వ్యక్తిగా, సిగ్గులేని ప్రచారకర్తగా రాహుల్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయ స్థాయిలో సాధిస్తున్న ప్రాధాన్యతను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రపంచ రాజకీయాల్లో భారత్ ‘‘సైడ్ ప్లేయర్’’.. రాహుల్ ‘‘పాక్ ఫ్యాన్ బాయ్’’ అంటూ బీజేపీ విమర్శలు..
-
India vs New Zealand: 32 ఏళ్ల నిరీక్షణకు తెర.. న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్లు..
-
APMDC: ఏపీలో మైనింగ్ రంగానికి భారీ ప్రణాళికలు.. ఏపీఎండీసీ ఐపీవోకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్!
-
KL Rahul History: తొలి భారత ఆటగాడిగా కేఎల్ రాహుల్ చరిత్ర.. దిగ్గజాల వల్లే కాలేదు!
-
Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!