న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 18 మంది మరణించారు. పలువురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. శనివారం రాత్రి14, 15 ప్లాట్‌ఫాంలపై ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా.. ఈ ఘటన జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు.. ఇప్పటికీ స్టేషన్ ప్రస్తుతం జనంతో కిక్కిరిసిపోయింది. రైళ్లు ఎక్కడానికి జనం ఎగబడుతున్నారు. చాలా మంది అత్యవసర విండో ద్వారా లోపలికి ప్రవేశిస్తున్నారు.
READ MORE: Rashid Khan-Wasim: వసీం అక్రమ్ కంటే రషీద్ ఖాన్ గొప్ప క్రికెటర్..
ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత.. అంటే ఈరోజు బీహార్ సంపర్క్ క్రాంతి ప్లాట్‌ఫామ్ నంబర్ 16 వద్దకు రాగానే జనాలు ఒక్కసారిగా రైలు ఎక్కడానికి ఎగబడ్డారు. కొంతమంది తలలపై బరువైన వస్తువులను మోసుకుని రైలు ఎక్కేందుకు యత్నించారు. మరికొందరు అత్యవసర విండో ద్వారా లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఈ ప్రదేశం 18 మంది ప్రాణాలను బలిగొన్న ప్రమాదం జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో లేదు. న్యూఢిల్లీ లాగే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో కూడా జనాలు కిక్కిరిసిపోయారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లోని 11, 12 ప్లాట్‌ఫారమ్ నంబర్‌లపై భారీ జనసమూహం కనిపించింది. 11వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రజలు మాహా కుంభమేళా స్పెషల్ రైలు కోసం ఎదురు చూస్తున్నారు.
READ MORE: Minister Kollu Ravindra: తప్పు చేసి తప్పించుకోవడం కోసం మళ్ళీ తప్పు చేసి దొరికాడు
కాగా.. ఈ ప్రమాద ఘటనపై అక్కడే కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న కూలీ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. “నేను 1981 నుంచి కూలీగా పనిచేస్తును. కానీ ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత జనసమూహాన్ని చూడలేదు. ప్రయాగ్‌రాజ్ స్పెషల్ ట్రైన్ 12వ నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ.. ఆ ట్రైన్‌ను 16వ నంబర్ ప్లాట్‌ఫామ్‌కు మార్చారు. 12వ ప్లాట్‌ఫారమ్‌పై వేచి ఉన్న జనం, బయట వేచి ఉన్న జనం 16వ ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ప్రజలు తోసుకుని ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారు. అక్కడే తొక్కిసలాట జరిగింది.” అని పేర్కొన్నారు.