షడ్రుచులలో ఒకటి ఉప్పు . భారతీయ వంటకాలలో ఉప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆహార పదార్ధాలకు రుచిని ఇస్తుంది. అంతేకాదు భూమిమీద జంతువులన్నింటి మనుగడకు తప్పనిసరిగా కావాల్సిందే. అయితే ఉప్పుని ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు. ఉప్పు ఖరీదు పదుల్లో ఉంటుంది.