Pregnant Woman: మహారాష్ట్రలోని జల్నా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ప్రసవ సమయంలో గర్భిణీ స్త్రీ పొత్తికడుపుపై యాసిడ్ పోశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రసవ సమయంలో మెడికల్ జెల్లీకి బదులుగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రుద్దారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై శనివారం అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.
ఓ ప్రిన్సిపాల్‌పై లేటీ టీచర్ యాసిడ్ దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లాలో కలకలం రేపుతోంది.. పాఠశాల ప్రిన్సిపాల్ పై ఓ ఉపాధ్యాయిని యాసిడ్ దాడికి పాల్పడిన ఘటన గుంటుపల్లి డాన్ బోస్కో స్కూల్ లో సోమవారం జరిగింది.
ప్రేమికుల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్‌లో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదంటూ ఓ యువతిపై యాసిడ్ దాడి చేశాడు ప్రియుడు. అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.. జిల్లాలోని గుర్రంకొండ మండలం ప్యారంపల్లికి చెందిన జనార్దన్, రెడ్డెమ్మ దంపతుల కుమార్తె గౌతమి (23) పై మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు.
Mumbai: ముంబైలో దారుణం చోటు చేసుకుంది. మాల్వాని ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ ముఖంపై భర్త యాసిడ్ పోసి దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బీహార్‌లోని షేక్‌పురాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. నేరస్థులు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని కళ్లను పీకేసి చంపారు. అంతేకాకుండా.. మృతుడి ఆధారాలు కనిపెట్టకుండా ఉండేందుకు.. మృతదేహాన్ని యాసిడ్ పోసి కాల్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన షేక్‌పురా జిల్లా ధరేని గ్రామంలో చోటు చేసుకుంది.
ఇంటిని ఎలాగైతే శుభ్రంగా ఉంచుకుంటామో.. బాత్రూమ్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే.. అనారోగ్యాల బారిన పడుతాం. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం కోసం, వాసన రాకుండా ఉండేందు కోసం ఎక్కువగా యాసిడ్‌ను వాడుతుంటారు. ఇది ఆరోగ్యానికి, బాత్రూమ్ రెండింటికీ మంచిది కాదు. బాత్రూమ్‌ను శుభ్రంగా ఉంచడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని ఉపయోగించిన తర్వాత బాత్రూంలో పసుపు కలర్, దుర్వాసన ఉండవు. ముఖ్యమైన విషయం ఏమిటంటే వీటితో బాత్రూమ్ శుభ్రం చేయడం చాలా సులభం.
ఫిలడెల్ఫియాలోని ఒక వైద్యుడు అనుకోకుండా ఒక మహిళకు ప్రమాదకరమైన ఇంజెక్షన్ ఇచ్చాడు. దీంతో ఆమె తల్లి కావాలనే కల శాశ్వతంగా విచ్ఛిన్నమైంది. కొన్ని నివేదికల ప్రకారం.. మాంసాన్ని కాల్చే యాసిడ్ ఇంజెక్ట్ చేసినట్లు ఆ మహిళ పేర్కొంది. దానివల్ల ఆమెకు పిల్లలు పుట్టరని ఆ మహిళ పేర్కొంది.
ఓ మహిళ కార్మికురాలు.. బాటిళ్లను క్లీన్ చేసే ఫ్యాక్టరీలో పని చేస్తుంది. అయితే పని చేస్తున్న సమయంలో ఆమెకు దాహం వేయడంతో దీంతో తన తోటి కార్మికురాలుని నీళ్లు ఇవ్వాలని కోరింది. అయితే, ఆమె చూసుకోకుండా యాసిడ్ బాటిల్ ఇచ్చింది.. దాన్ని మంచి నీళ్లు అనుకుని సదరు మహిళ తాగేసింది. దీంతో ఒక్కసారిగా నోటిలో విపరీతమైన మంట ప్రారంభమైంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
క్షణికావేశాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇటీవల అనుమానమనే పెనుభూతం సంబంధాలను తుంచివేస్తోంది. తాజాగా ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు గొడవపడి ఓ మహిళ తన భర్త ముఖంపై యాసిడ్ పోసింది.