ఎండాకాలంలో దాహం బారినుంచి బయటపడాలంటే ఓ కొబ్బరి బోండా తాగితే చాలు. ఇట్టే దాహం తీరిపోతుంది. అంతేకాకుండా మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. ఇలా కొబ్బరి నీళ్లతో ఆరోగ్యానికి సంబంధించి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మాములుగా కొబ్బరినీళ్లు నీరసంగా ఉన్నా, లేదంటే జ్వరం వచ్చినా తాగితే తొందరగా కోలుకోవచ్చు.